Begin typing your search above and press return to search.
బాహుబలి గ్రౌండ్‌కు భారీ పూజలు
By: Tupaki Desk | 9 Jun 2015 3:59 PM GMTప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆ ఘడియ రానే వచ్చింది. బాహుబలికి సంబంధించిన కీలకఘట్టానికి అంతా రెడీ అవుతోంది. ఈ సినిమా ఆడియో ఈనెల 13న తిరుపతిలో గ్రాండ్‌గా జరగనుంది. అలాగే జూలై 10 రిలీజ్ తేదీ ఫిక్స్ అంటూ అధికారికంగా చెబుతున్నారు.
ఆడియో వేడుకకు తిరుపతి స్టేడియంలో పూజా కార్యక్రమం కూడా పూర్తి చేశారు. ఠెంకాయ కార్యక్రమంలో రాజమౌళి, ఎన్వీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు రెండేళ్ల తర్వాత ప్రభాస్ నటించిన సినిమా రిలీజవుతోంది అంటే ఆ సందడి ఎలా ఉంటుందో ఊహించగలం. ప్రభాస్ అభిమానులు ఊపిరి బిగబట్టి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకేనేమో బాహుబలి ఆడియో ఫంక్షన్ జరిగే గ్రౌండ్‌కు పూజలు కూడా చేస్తున్నారు. అయితే కీరవాణి అందించిన పాటలు ఎలా ఉండబోతున్నాయ్ అనే ఉత్సుకత అందరిలోనూ నెలకొని ఉంది. పూజ చేసి మరీ గ్రౌండ్‌లో పనులు మొదలెట్టారంటే.. ఆ రోజు మైకు సెట్టుల సౌండ్‌కు తిరుపతి దద్దరిల్లాల్సిందే...
ఇకపోతే సినిమాను జూలై 10న విడుదల చేస్తున్నట్లు రాజమౌళి కాకుండా ఆడియోను రిలీజ్ చేస్తున్న కంపెనీవారు పేర్కొనడం విశేషం. సెంటిమెంట్‌గా తానేం చెప్పట్లేదని రాజమౌళి ఫిక్సయిపోయాడా ఏంటి?