Begin typing your search above and press return to search.

బాహుబలి ఆడియో లీకైందా?

By:  Tupaki Desk   |   10 Jun 2015 11:30 AM GMT
బాహుబలి ఆడియో లీకైందా?
X
తెలుగు సినిమాల్లో ఇది కొత్తేమీ కాదు. సినిమా విడుదలకు ముందే సగం సినిమా లీక్‌ అయిపోవడం చూశాం. ఇక ఆడియో లీకైతే పెద్ద విషయమేం కాదు. ఐతే ఆ లీక్‌ పొరబాటున జరిగిందా.. కావాలనే లీక్‌ చేస్తారా అన్నదే ఒక్కోసారి సందేహాలు రేపుతుంది. ఇంకో నాలుగు రోజుల్లో బాహుబలి ఆడియో వేడుకను తిరుపతిలో అంగరంగ వైభంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతుండగా.. ఈ రోజు వాట్సాప్‌లో బాహుబలి ఆడియో పేరుతో కొన్ని ట్రాక్స్‌ బయటికి వచ్చాయి. అవి బాహుబలి ట్రాక్సే అని కచ్చితంగా చెబుతున్నారు.

ఐతే ఒరిజినల్‌ ఆడియోలో వింటున్నట్లు క్లారిటీ లేవని అంటున్నారు. గతంలో కూడా పెద్ద సినిమాలకు సంబంధించిన చాలా పాటలు ఆడియో విడుదలకు ముందే నెట్లో రిలీజైపోయాయి. ఐతే వాటిలో చాలా వరకు పబ్లిసిటీ కోసం ఉద్దేశపూర్వకంగా లీక్‌ చేసినవే ఉన్నాయి. మరి 'బాహుబలి' విషయంలో ఏం జరిగిందో మరి. ఈ సినిమాకు సంబంధించిన 12 నిమిషాల వీడియో ఫుటేజ్‌ కొన్ని నెలల కిందట వాట్సాప్‌లోకి వచ్చేయడం సంచలనం రేపింది. ఐతే అది కుట్రపూరితంగా జరిగిందే అంటూ ఓ వ్యక్తిని అరెస్టు కూడా చేశారు. ఇంతకుముందే ఓసారి తప్పు జరిగినపుడు.. ఇంకోసారి అలా జరక్కుండా జాగ్రత్త పడాలి కదా!