Begin typing your search above and press return to search.

మరీ నాలుగు రోజుల్లో ఏంటి బాసూ!

By:  Tupaki Desk   |   14 July 2015 9:01 AM GMT
మరీ నాలుగు రోజుల్లో ఏంటి బాసూ!
X
రికార్డులనేవి బద్దలవడానికే ఉంటాయి. కానీ ఇప్పుడు బాహుబలి సృష్టిస్తున్న రికార్డుల్ని మరే తెలుగు సినిమా అయినా ఇంకో పదేళ్లకైనా దాటుతుందా అనేది సందేహమే. బాహుబలి రికార్డుల్ని బాహుబలి-2 బద్దలు కొట్టాలి తప్పితే.. మళ్లీ రాజమౌళే ఇంకో సినిమా తీసినా రికార్డును అందుకునే అవకాశం ఉండదేమో.

2006లో అప్పటిదాకా ఉన్న చలనచిత్ర రికార్డులన్నింటినీ ‘పోకిరి’ సినిమా తిరగరాసింది. ఈ రికార్డులు మూడేళ్ల పాటు చెక్కు చెదరలేదు. ఐతే 2009లో మగధీర సినిమా వచ్చి.. ఆ రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేసింది. ఫస్ట్ కలెక్షన్ల నుంచి ఫుల్ రన్ కలెక్షన్ల వరకూ కొత్త రికార్డులు నమోదయ్యాయి. కేవలం తొమ్మిది రోజుల్లోనే ‘మగధీర’.. పోకిరి రికార్డుల్ని కొట్టేయడం విశేషం.

మగధీర రికార్డులు నాలుగేళ్ల పాటు నిలిచాయి. 2013లో అత్తారింటికి దారేది ప్రభంజనం సృష్టించి.. మగధీరను కొట్టేసింది. ఐతే మగధీర టోటల్ కలెక్షన్ల రికార్డును దాటడానికి ఈసారి 25 రోజులు పట్టడం విశేషం. ఐతే ‘అత్తారింటికి దారేది’ అంత కష్టపడితే.. ఇప్పుడు బాహుబలి మాత్రం అలవోక ఆ రికార్డును కొట్టేసింది. కేవలం నాలుగే రోజుల్లో ‘అత్తారింటికి దారేది’ ఫుల్ రన్ కలెక్షన్ల రికార్డును దాటేసింది. ఐతే హిందీ, తమిళం, మలయాళం భాషల్లోనూ విడుదల కావడం బాహుబలికి కలిసొచ్చిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.