Begin typing your search above and press return to search.

బాహుబ‌లుడు 'పీకే'సేట్టున్నాడే

By:  Tupaki Desk   |   14 Sep 2015 4:15 AM GMT
బాహుబ‌లుడు పీకేసేట్టున్నాడే
X
చైనీస్ మార్కెట్ లో తెలుగు సినిమా. ఇది ఊహకే అంద‌ని ఊహ క‌దూ! కానీ ఇది సాధ్య‌మ‌వుతోంది. రాజ‌మౌళి అలియాస్ జ‌క్క‌న్న వ‌ల్ల ఏదైనా సాధ్య‌మే. ఇంత‌కాలం అమెరికా - గ‌ల్ఫ్ బాక్సాఫీసుల్ని గ‌డ‌గ‌డ‌లాడించిన బాహుబ‌లి ఇక మీద‌ట చైనా బాక్సాఫీస్‌ ని కొల్ల‌గొట్ట‌బోతోంది. న‌వంబ‌ర్‌ లో చైనీస్ థియేట‌ర్ల‌లో మ‌న బాహుబ‌లి రిలీజ‌వుతోంది.

ఇప్ప‌టికే ఎడిటింగ్ స‌హా అనువాద కార్య క్ర‌మాలు మొద‌లెట్టేయ‌డానికి రంగం సిద్ధం చేశారు. దీనికోసం హాలీవుడ్ ఎడిటింగ్ దిగ్గ‌జం విన్సెంట్ త‌బైల‌న్‌ ని రంగంలోకి దించారు. ఈ స్టార్స్ ఫిలింస్ ఈ చిత్రాన్ని చైనాలో రిలీజ్ చేస్తోంది. ఈపాటికే డీల్ సెట్ట‌య్యింది. బాహుబ‌లిని ఎంత‌వ‌ర‌కూ క‌ట్ చేయాలి అన్న‌ది విన్సెంట్ చూసుకుంటున్నారు. చైనీస్ మార్కెట్ లో మైథాల‌జీ సినిమాల‌కు అసాధార‌ణ‌మైన గిరాకీ ఉంది. క‌ల్చ‌ర్ బేస్డ్ సినిమాల‌కు ప‌ట్టంగ‌డ‌తార‌క్క‌డ‌. అందుకే బాహుబ‌లి పై చైనాలో భారీ అంచ‌నాలున్నాయి. పైగా అక్క‌డ స్థానిక భాష‌ల్లో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు కాబ‌ట్టి ఆ మేర‌కు రికార్డులు సాధ్య‌మేన‌ని అంచ‌నాలేస్తున్నారు. అయితే చైనీ మార్కెట్ లో అమీర్‌ ఖాన్‌ - షారూక్ ఖాన్‌(హ్యాపీ న్యూఇయ‌ర్‌)ల‌కు రికార్డులున్నాయి.

మిస్ట‌ర్ పెర్ ఫెక్ట్ అమీర్‌ ఖాన్ న‌టించిన పీకే చైనీ బాక్సాఫీస్ వ‌ద్ద దాదాపు 107కోట్లు వ‌సూలు చేసి సంచ‌ల‌నం సృష్టించింది. ఈ సినిమా అసాధార‌ణంగా 4,500 స్ర్కీన్ ల‌లో రిలీజైంది. ఇప్పుడు బాహుబ‌లి పీకేని కొట్టేసేలా మ‌రో 500 థియేట‌ర్లు అద‌నంగా.. అంటే 5000 స్ర్కీన్ ల‌లో రిలీజ‌వుతోంది. ఒక‌వేళ బాహుబ‌లి చైనీ మార్కెట్ లో 100 కోట్ల మార్కును అధిగ‌మిస్తే.. ఇప్ప‌టివ‌ర‌కూ పీకే పేరిట ఉన్న రికార్డుల‌న్నిటినీ బాహుబ‌లి కొట్టేసినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు.

అలాగే బాహుబ‌లి బుసాన్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలింఫెస్టివ‌ల్ - టొరెంటో ఫిలింఫెస్టివ‌ల్స్‌లో ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. అక్క‌డ పోటీబ‌రిలో ఉందీ సినిమా. దీనివ‌ల్ల చైనీ మార్కెట్ లోనూ అసాధార‌ణ గిరాకీ పెరుగుతుంద‌న్న‌ది జ‌క్క‌న్న ఆలోచ‌న‌. అది సంగతి.