Begin typing your search above and press return to search.
హిందీ బాహుబలి.. 2015లో టాప్ 3 మూవీ
By: Tupaki Desk | 2 Sep 2015 5:58 PM GMTబాహుబలి సంచలనాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 600 కోట్ల గ్రాస్ వసూళ్ల తో దూసుకుపోతోంది. అయితే ఈ సినిమా కేవలం ఒక్క హిందీ లోనే ఇండియా బాక్సాఫీస్ నుండి 120 కోట్లు నెట్ షుమారు వసూలు చేసిందని అంచనా. ఇప్పటికీ ఉత్తరాదిన చాలా థియేటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతోందట.
ఇకపోతే 50 రోజులు రన్ పూర్తి చేసుకున్న బాహుబలి హిందీ వర్షెన్ ఈ ఏడాది రిలీజై వసూళ్ల ప్రభంజనం సృష్టించిన టాప్ 3 సినిమాల్లో ఒకటి. కంగన రనౌత్ నటించిన తను వెడ్స్ మను, సల్మాన్ ఖాన్ నటించిన భజరంగి భాయిజాన్ తర్వాత అంతటి భారీ వసూళ్లు సాధించిన సినిమా ఇది. నిన్నటి కలెక్షన్ల తో ఏకంగా డైరక్ట్ హిందీ మూవీ ఎబిసిడి 2 వసూల్ళను దాటేసిందట. గత పదేళ్ళ లో హిందీలో రిలీజై టాప్ వసూళ్లు సాధించిన తొలి డబ్బింగ్ సినిమా బాహుబలి. ఇకపోతే తనూ వెడ్స్ మనూ, బజరంగీ భాయ్ జాన్ వసూళ్లను దాటలేకపోవచ్చు కాని.. పెద్ద స్టార్ల సినిమాలు వచ్చేవరకు బాహుబలి ఈ నెం.3 పొజిషన్ లో ఈ ఏడాది ఎక్కువ రోజులే కొనసాగే ఛాన్సుంది కూడా.
ఏ రకంగా చూసినా బాహుబలి రికార్డులే రికార్డులు. ఇదంతా ఎస్.ఎస్.రాజమౌళి సాధించిన అపూర్వ విజయం. అతడు సృష్టించిన అద్భుతమైన విజువల్స్ మహిమ అంటూ బాలీవుడ్ మీడియా ఆకాశానికెత్తేస్తోంది. ఈ లెక్కల్ని బట్టి బాహుబలి 2 మార్కెట్ కేవలం ఒక్క బాలీవుడ్‌లోనే 300కోట్లను తాకితే ఆశ్చర్యపోనక్కర్లేదన్నమాట.