Begin typing your search above and press return to search.
చెన్నైలో బాహుబలి పరాక్రమం చూశారా?
By: Tupaki Desk | 8 Aug 2015 11:54 AM GMTతమిళ డబ్బింగ్ సినిమాల ధాటికి తెలుగు సినిమాలు కుదేలయిపోవడం చాలాసార్లు జరిగింది. చంద్రముఖి, గజిని, అపరిచితుడు, శివాజీ, రోబో లాంటి సినిమాలు పోటీగా వచ్చిన తెలుగు సినిమాలు బెంబేలెత్తిపోయేలా చేశాయి. ఐతే ఓ తెలుగు సినిమా తమిళ సినిమాల్ని వణికిస్తుందని ఎన్నడూ ఊహించలేదు. ఆ ఘనత బాహుబలికే దక్కింది. ధనుష్ లాంటి స్టార్ హీరో సినిమా బాహుబలి ముందు నిలవలేకపోయింది. జులై 10న బాహుబలి విడుదల కాగా.. తర్వాతి వారం వచ్చిన ధనుష్ సినిమా ‘మారి’ యావరేజ్ టాక్ తో మొదలై.. బాహుబలి దెబ్బకు బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అనిపించుకుంది. బాహుబలి నాలుగో వారంలోనూ చెన్నై బాక్సాఫీస్ లో నెంబర్ వన్ గా కొనసాగుతుంటే.. మారి తొమ్మిదో స్థానానికి పడిపోవడం విశేషం.
చెన్నై బాక్సాఫీస్ ఓవరాల్ కలెక్షన్ల లోనూ బాహుబలి చరిత్ర సృష్టించింది. తమిళ ఆల్ టైం హైయెస్ట్ గ్రాసర్స్ లో బాహుబలి నాలుగో స్థానంలో ఉండటం విశేషం. శంకర్ ‘ఐ’ సినిమా రూ.9.68 కోట్లతో అగ్రస్థానంలో ఉంటే.. విజయ్ ‘కత్తి’ రూ.7.83 కోట్లతో, లింగా రూ.6.78 కోట్లతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ప్రస్తుతం బాహుబలి రూ.6.7 కోట్లు రాబట్టి నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఫుల్ రన్ లో ‘లింగా’ను దాటేసి మూడో స్థానానికి చేరడం ఖాయం. ధనుష్ సినిమా వేల ఇల్ల పట్టాదారి రూ.6.66 కోట్లు, కాంఛన-2 రూ.6.27 కట్లు, వీరం రూ.6.14 కోట్లు, ఎన్నై అరిందాల్ రూ.6 కోట్లు, జిల్లా రూ.5.68 కోట్లు, కోచ్చడయాన్ రూ.5.6 కోట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.