Begin typing your search above and press return to search.
'బాహుబలి: ది లాస్ట్ లెజెండ్స్' వచ్చేస్తోంది
By: Tupaki Desk | 3 Feb 2016 12:27 PM GMTదర్శకధీరుడు రాజమౌళి తీసిన బాహుబలి లాంటి మూవీ.. కామిక్ రూపంలో కూడా వచ్చేస్తోంది. కేరక్టర్ ఎంటర్ టెయిన్ మెంట్ కంపెనీ అయిన గ్రాఫిక్ ఇండియాతో కీలక ఒప్పందం చేసుకుంది ఆర్కా మీడియా వర్క్స్. డిజిటల్ కామిక్స్, మొబైల్ షార్ట్స్ తీయడంలో దిట్ట అయిన గ్రాఫిక్ ఇండియాతో కలిసి.. బాహుబలి సిరీస్ ని టీవీల్లోకీ పంపిస్తున్నాడు రాజమౌళి.
'బాహుబలి: ది లాస్ట్ లెజెండ్స్' పేరుతో యానిమేషన్ సిరీస్ రూపొందనుంది. ఈ కేరక్టర్ ను ప్రజల్లోకి ఇంకా విస్తృతంగా తీసుకెళ్లే ఉద్దేశ్యంతోనే.. ఈ ఎపిసోడ్ కి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని తెలుస్తోది. గ్రాఫిక్ ఇండియా - ఆర్కా మీడియాలు రెండూ కలిసి ఈ ప్రాజెక్టును హ్యాండిల్ చేయనున్నాయి. ఈ సిరీస్ ని కూడా రాజమౌళి గైడెన్స్ లోనే పిక్చరైజ్ చేయనున్నారు. అలాగే జక్కన్న - శోభు యార్లగడ్డ - గ్రాఫిక్ ఇండియా సంస్థలు సహ నిర్మాతలుగా వ్యవహరించనున్నాయి.
బాహుబలి మర్కండైజ్ ను కూడా బరిలోకి దింపే ఉద్దేశ్యంతోనే.. ఈ ప్రాజెక్టుకు పునాది పడింది అని తెలుస్తోంది. యానిమేషన్ సిరీస్ గనుక క్లిక్ అయితే.. బాహుబలి కూడా ఓ సూపర్ మ్యాన్ తరహాలో ఇంటింటిలోనూ తిరిగే ఛాన్సులు ఉన్నాయి. బాహుబలికి సంబంధించిన మర్కండైజ్ ను మార్కెట్ చేసేందుకు.. ఈ సిరీస్ సక్సెస్ కావడం చాలా ముఖ్యం అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.