Begin typing your search above and press return to search.
2016లో బాహుబలి 2 లేనట్టే
By: Tupaki Desk | 29 Sep 2015 9:30 AM GMT2015 జూలైలో బాహుబలి రిలీజైంది. 600 కోట్ల వసూళ్లతో దేశంలోనే అసాధారణ రికార్డులు నెలకొల్పిన సినిమాగా పేరు తెచ్చుకుంది. దాదాపు 250కోట్ల బడ్జెట్ తో బాహుబలిని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నానని రాజమౌళి అన్నారు. రెండో భాగం 40శాతం షూటింగ్ కూడా పూర్తి చేశామని అన్నారు. ఇంకో 60 శాతం షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. 2016లో బాహుబలి : ది కన్‌క్లూజన్ రిలీజ్ చేస్తాం అని అన్నారు. అయితే వాస్తవ పరిస్థితిని చూస్తే బాహుబలి పార్ట్ 2 2016లో వస్తుందా? అన్న సందేహాలున్నాయి. అందుకు రుజువుగా నిన్నటిరోజున రానా ఓ క్లూ ఇచ్చాడు.
రానా హీరోగా కొరియో గ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ దర్శకత్వంలో నవంబర్ లో ఓ సినిమా ప్రారంభం కానుందని వార్త వచ్చింది. అందుకోసం రానా స్మార్ట్ లుక్ మెయింటెయిన్ చేస్తున్నాడు. తమిళ్ లో బెంగళూర్ డేస్ షూటింగ్ పూర్తి చేసుకుని ఈ సినిమా కోసం రానా సన్నద్ధమవుతున్నాడని చెప్పుకున్నారు. ఇలా అయితే అదే నవంబర్ లో మొదలయ్యే బాహుబలి 2016లో రిలీజవ్వడం ఎలా పాజిబుల్? బాహుబలి కోసం రానా, ప్రభాస్ ఇద్దరూ రూపురేఖల్ని మార్చుకోవాల్సి ఉంది. భారీగా కసరత్తులు చేయాల్సి ఉంది. ఇటీవలి కాలంలో ఈ ఇద్దరి లుక్ చూస్తుంటే కాస్త సన్నగా, స్మార్ట్ గా మారిన రూపంతో కనిపిస్తున్నారు. దీంతో డౌట్ రెయిజ్ అయ్యింది.
అవన్నీ కాదనుకున్నా రానా నవంబర్ లో కొత్త సినిమా మొదలెట్టి ఎప్పుడు పూర్తి చేస్తాడు? ఎప్పుడు బాహుబలి సెట్ కి వస్తాడు? అటుపై గ్రాఫిక్స్ - విజువల్ ఎఫెక్ట్స్ పనుల మాటేమిటి? పైగా బాహుబలి మొదటి భాగం విజయం చూశాక.. రెండో భాగం కథ పూర్తిగా మారుతోంది.. అని అన్నారు. దానికి సంబంధించిన అప్ డేట్ ఇంతవరకూ రానేలేదు. అలా మారితే దానికి తగ్గ కసరత్తుకు కూడా టైమ్ ఎక్కువే పడుతుంది. అందుకే 2016లోనే బాహుబలి 2 రిలీజవ్వడం అసంభవం అని చెబుతోంది. మీరేమంటారు? అధికారిక వార్త వచ్చే వరకూ వేచి చూడాల్సిందే.