Begin typing your search above and press return to search.
పిచ్చి పీక్స్ కు వెళ్ళింది
By: Tupaki Desk | 12 May 2017 9:34 AM GMTబాహుబలి మేనియా జనాలను ఊపేస్తోంది. తెలుగులోనే కాదు.. విడుదలైన అన్ని భాషల్లోనూ బాహుబలి జనాలకు తెగ నచ్చేశాడు. రాజమౌళి సృష్టించిన మాహిష్మతి సామ్రాజ్యానికి... అందులోని పాత్రలకు జనం బాగానే కనెక్టయిపోయారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా బాహుబలి-2 కలెక్షన్లు వెయ్యి కోట్ల రూపాయలు దాటిపోయాయి. భారతీయ సినిమాలోనే హయ్యస్ట్ గ్రాసర్ అవడం విశేషం. ఫుల్ రన్ పూర్తయ్యేసరికి కలెక్షన్లు ఇంకా భారీగానే పెరుగుతాయి. ఈ సినిమాతో హీరొో ప్రభాస్ నేషనల్ లెవెల్లో పాపులర్ అయిపోయాడు.
ముఖ్యంగా అభిమానం విషయంలో మనకన్నా కాస్త అతి ప్రదర్శించే తమిళ జనాలు ఈ విషయంలోనూ కాస్త ముందే ఉన్నారు. నిన్నటికి నిన్న ఓ పెళ్లిలో బాహుబలి - దేవసేన కలిసి బాణాలు వేస్తున్నట్లు ఉన్న ఫొటోతో పెళ్లికొడుకు. పెళ్లికూతుళ్ల ఫ్లెక్సీ పెట్టారు. తాజాగా కోయంబత్తూర్ లోని ఓ హోటల్ లో ఫుడ్ కాంబోలన్నింటికీ బాహుబలి పేరు పెట్టేశారు. పుష్టిగా తినే ఐటంలకేమో బాహుబలి - భళ్లాలదేవుడి పేర్లు పెట్టారు. లైట్ గా లాగించే ఐటం లకు సుందరాంగులు దేవసేన, అవంతిక పేర్లు పెట్టేశారు. చికెన్ బిర్యానీ, చిల్లీ ఫిష్ కాంబో అంటే భళ్లాలదేవుడట. ఇంకా హెవీగా ఉండే మటన్ బిర్యానీ.. చికెన్ లాలీపాప్ కాంబో అంటే బాహుబలి. దేవసేన అంటే చపాతీ విత్ ఎగ్ మసాలా... ఇక నాజూకు సుందరి అవంతిక అంటే వెజ్ మీల్స్ విత్ మష్రూమ్ పెప్పర్ ఫ్రై. మామూలు మీల్స్ విత్ ఫిష్ కు కట్టప్ప నామకరణం చేశారు. క్యారెక్టర్ ను బట్టి ఫుడ్ రేంజి డిసైడ్ చేశారన్న మాట.
బాహుబలి సినిమాగా పూర్తయినా గేమ్స్ - టీవీ సిరీస్ - ఇతర రూపాల్లో కొనసాగుతుందని రాజమౌళి గతంలోనే చెప్పాడు. శివగామి క్యారెక్టర్ తో ఓ బుక్ కూడా రాశారు. బాహుబలిని ఓ బ్రాండ్ గా తయారుచేస్తామని కూడా అన్నాడు. కానీ తమిళ జనాలు ఆ పని ఆల్రెడీ మొదలెట్టేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/