Begin typing your search above and press return to search.
`గూగుల్ ప్లే`లోనూ `బాహుబలి`హవా!
By: Tupaki Desk | 1 Dec 2017 3:30 PM GMTబాహుబలి రికార్డులకు, అవార్డుల పరంపరకు ఇప్పట్లో బ్రేక్ పడేలా లేదు. దాదాపు 7 నెలల క్రితం విడుదలైన ఈ చిత్రం విడుదలకు ముందే అనేక రికార్డులను బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. విడుదలైన తర్వాత కూడా ప్రపంచవ్యాప్తంగా సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. తాజాగా - సీఎన్ ఎన్ ఐబీఎన్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2017గా `బాహుబలి-2` ఎంపికవడం, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేతుల మీదుగా రమ్యకృష్ణ - యార్లగడ్డ శోభులు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందుకోవడం విదితమే. ఆ అవార్డు అందుకున్న మరుసటి రోజే బాహుబలి మరో రెండు సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. గూగుల్ ప్లేను బాహుబలి షేక్ చేసింది. 2017లో గూగుల్ ప్లే లో అత్యధికంగా వీక్షించిన పాటగా ‘సాహోరే బాహుబలి’ రికార్డు క్రియేట్ చేసింది. దాంతోపాటు, గేమ్ లలో 2017కు గానూ ‘బాహుబలి: ది గేమ్` టాప్ పొజిషన్ లో నిలిచింది. ఈ వివరాలను గూగుల్ శుక్రవారం అధికారికంగా వెల్లడించింది.
అయితే, ‘డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్స్’ - ‘సూపర్ మ్యారియో రన్’ - ‘పోకెమాన్ డ్యుయల్’ వంటి ఇంటర్నేషనల్ గేమ్ లను పక్కకు నెట్టి లోకల్ గేమ్ బాహుబలి టాప్ స్థానంలో ఉండడం తెలుగువారు గర్వించదగ్గ విషయం. అంతేకాక, ఒక తెలుగు సినిమాతోపాటు అందులోని పాట - గేమ్ ఇంత పాపులర్ కావడం సాధారణ విషయం కాదు. ఇక మిగతా కేటగిరీల్లో ‘డియర్ జిందగీ’ చిత్రం 2017 గూగుల్ ప్లేలో పాపులర్ చిత్రంగా నిలిచింది.
‘మోనా’ - ‘వండర్ ఉమెన్’ చిత్రాలు రెండు - మూడు స్థానాల్లో ఉన్నాయి. ‘ఫొటో ఎడిటర్- బ్యూటీ కెమెరా - ఫొటో ఫిల్టర్స్’ - ‘మెసెంజర్ లైట్’ యాప్ లు టాప్ ట్రెండింగ్ లో ఉన్నాయి. రిషి కపూర్ - కరణ్ జోహార్, రఘురామ్ రాజన్ ల బయోపిక్ పుస్తకాలు అగ్రస్థానాన్ని దక్కించుకున్నాయి.