Begin typing your search above and press return to search.
బాహుబలి డ్రెస్సులు వస్తున్నాయ్!!
By: Tupaki Desk | 30 March 2017 3:02 PM GMTబాహుబలి ది కంక్లూజన్ విడుదలకు కచ్చితంగా ఇంకా నెల రోజులు మాత్రమే ఉంది. ఇవాల్టి నుంచి కచ్చితంగా 30వ రోజున అంటే ఏప్రి్ల 28న బాహుబలి2 థియేటర్లలోకి వచ్చేస్తోంది. ఇప్పటికే ఈ మూవీ కోసం బోలెడన్ని పబ్లిసిటీ టెక్నిక్స్ ఉపయోగిస్తున్నారు. అసలు ఏ మాత్రం ప్రచారం అవసరం లేనంత హైప్ ఉన్నా.. కొత్త కొత్త టెక్నిక్స్ తో ఇంకా బాహుబలిపై అంచనాలని ఆకాశమే హద్దు అన్నట్లుగా పెంచుతున్నారు.
ఇప్పుడు బాహుబలి డ్రస్సులు కూడా అందుబాటులోకి వచ్చేయనున్నాయి. కాకపోతే ఇది కంప్లీట్ బాహుబలిలో ఉపయోగించినవి కాదు. అనుపమా దయాల్.. సౌరభ్ కాంత్ శ్రీవాస్తవన్.. సైలెక్స్ వంటి ప్రముఖ ఆరుగురు డిజైనర్లు బాహుబలి ది కంక్లూజన్ స్ఫూర్తితో.. అందుకు దగ్గరగా ఉండేలా డ్రస్ లను డిజైన్ చేసి.. వాటిని ఆన్ లైన్ పోర్టల్ సౌజన్యంతో విక్రయాలు చేపట్టనున్నారు. ఈ డిజైనర్ల జాబితాలో మృణాళిని గుప్తా.. యోగేష్ గుప్తా.. అపరాజితా టూర్ లు కూడా ఉన్నారు.
బాహుబలి2 లో ప్రధాన పాత్రధారులు అయిన అందరినీ పోలిన డ్రెస్ లు విక్రయించనుండగా.. ఏప్రిల్ 7న రానా దగ్గుబాటి.. తమన్నాలతో ఓ ఫ్యాషన్ షో కూడా నిర్వహించనుండడం విశేషం. తాము విక్రయించే కాస్ట్యూమ్స్ ధర కూడా ఎక్కువ కాదని.. గరిష్టంగా రూ.4 వేలకు మాత్రమే ఉంటాయని డిజైనర్స్ చెబుతుండడం విశేషం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/