Begin typing your search above and press return to search.

బాహుబలి.. ఈద్‌ మ్యాజిక్‌ కూడానా..

By:  Tupaki Desk   |   17 July 2015 7:59 PM GMT
బాహుబలి.. ఈద్‌ మ్యాజిక్‌ కూడానా..
X
మేగ్నమ్‌ ఓపస్‌ బాహుబలి అంటే బాహుబలే. సినిమా విడుదలైన రోజు నుండి ఈరోజు వరకు బాక్సాఫీస్‌ రిజిష్టరు పరిగెత్తేస్తోంది. 250 కోట్ల క్లబ్బులో చేరడం అంటే మామూలు విషయం కాదు మరి. ఇదంతా కేవలం కంటెంట్‌ వలనే సాధ్యపండి, నో డౌట్‌ ఎబౌట్‌ ఇట్‌. కాని ఇంతటి కంటెంట్‌ జనాలకు చేరువకావాలంటే ఎంతో ప్రమోషన్‌ ఉండాలి. అది కూడా చాలా స్ట్రాటజిక్‌ గా ఉండాలి. అలాంటి స్ట్రాటజీలు ప్లాన్‌ చేయడంలో రాజమౌళి దిట్ట.. ఇదిగో ఇదో కొత్త ఎగ్జాంపుల్‌.

తొలి నుండి ఏదో ఒక సంచలనాత్మక పోస్టర్‌ రిలీజ్‌తోనో వీడియో రిలీజ్‌తోనో బాహుబలిపై అంచనాలను పెంచేస్తూనే ఉన్నారు. ఇక సినిమా విడుదలై వారం రోజు అయిపోయాక.. ఒక కొత్త పోస్టర్‌ దిగింది. ఒక ప్రక్కన రానా, మరో ప్రక్కన ప్రభాస్‌.. ఇద్దరూ మొహమ్మదీయుడిలా టోపి ధరించి సలాం వాలేకుమ్‌ అన్నట్లు ఫోజిచ్చారు. సినిమాలో ఫ్లాష్‌బ్యాక్‌ సీన్‌లో వేరే రాజ్యంకు వెళ్ళినప్పుడు వీరు ఇలాంటి గెటప్‌లో కనిపిస్తారు. సరిగ్గా ఇప్పుడు రంజాన్‌, ఈదుల్‌ ఫితర్‌ పండుగ రావడంతో ఆ గెటప్‌లు ఇలా ప్రమోషన్‌కు పనుకొచ్చాయి. సాధారణంగా ఈద్‌ పండుగకు ఇలాంటి మ్యాజిక్స్‌ అన్నీ సల్మాన్‌ ఖాన్‌ చేస్తుంటాడు. కాని ఈసారి రాజమౌళి మన ఇండియా భాయ్‌ ని మించిపోయాడులే.