Begin typing your search above and press return to search.
ఆల్రెడీ స్వీయ నిర్భంధంలోనే ఉన్నాం డార్లింగ్
By: Tupaki Desk | 22 March 2020 5:54 AM GMTదేశమంతా జనతా కర్ఫ్యూ అమలవుతున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే రోడ్లన్నీ నిర్మాణుష్యంగా మారాయి. బస్సులు.. రైళ్లు.. విమానాలు అన్నిటినీ బంద్ చేయడంతో ప్రయాణాలు నిలువరించగలిగారు. ఇక ప్రజలు స్వచ్ఛందంగా ఈ కర్ఫ్యూకి సాయపడుతున్నారు. ప్రధాని ఇచ్చిన పిలుపును గౌరవించి సెలబ్రిటీలు సహా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు స్వీయ నిర్భందానికి అంగీకరించారు.
ఇక దీనిపై ఇప్పటికే పలువురు స్టార్లు విస్త్రతంగా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్లు సహా అన్ని పరిశ్రమల స్టార్లు స్వీయ నిర్భంధంలో ఉన్నారు. తాజాగా డార్లింగ్ ప్రభాస్ నుంచి పిలుపు అందింది. ప్రభాస్ ఇప్పటికే స్వీయ నిర్భంధం (సెల్ఫ్ క్వారంటైన్)లో ఉన్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా తాను స్వీయ నిర్బంధం విధించుకున్నానని ప్రభాస్ అన్నారు. మీరంతా కూడా కరోనా విషయంలో జాగ్రత్త అంటూ హెచ్చరించారు. ఆ మేరకు సోషల్ మీడియాల్లో సందేశం పోస్ట్ చేశారు ప్రభాస్. దీనికి డార్లింగ్ అభిమానుల ఉంచి అదిరిపోయే స్పందన వచ్చింది. మేము కూడా మీ బాటలోనే (వీ కెన్ ఆల్సో) అంటూ రియాక్ట్ అవుతున్నారు.
ప్రస్తుతం జాన్ (ప్రభాస్ 30) చిత్రీకరణలో ఉన్న ప్రభాస్ షూటింగులు బంద్ ప్రకటన తో జార్జియా నుంచి హైదరాబాద్ కి తిరిగి వచ్చేశారు. ఈనెలాఖరు వరకూ షూటింగులు బంద్. ఆ క్రమంలోనే ఇంట్లోనే స్వీయ నిర్భంధంలో ఉన్నారు. కనీసం జనతా కర్ఫ్యూ ఫలించి వైరస్ విస్త్రతిని తగ్గించగలిగితే మంచిదే. ఈ కర్ఫ్యూని మరో రెండ్రోజులు పొడిగించినా తప్పేమీ కాదన్న వాదనా వినిపిస్తోంది. షూటింగులు బంద్.. రిలీజ్ లు బంద్ చేయడంతో సినీఇండస్ట్రీ అల్లకల్లోలం అయ్యింది. ఉపాధి జీరో అయిపోయింది. కనీసం ఏప్రిల్ నాటికి అయినా పరిష్కారం దొరుకుతుందా? అంటే అంత సులువుగా ఏదీ కనిపించడం లేదు. జాన్- ఆచార్య- ఆర్.ఆర్.ఆర్ ఒకటేమిటి భారీ సినిమాల షూటింగులతో పాటు అన్ని షూటింగులు నిలిచిపోయాయి. ఈ ఎమర్జెన్సీ నుంచి బయటపడేది ఎలా? అన్నదే అందరి ముందూ ఇప్పుడున్న టాస్క్.