Begin typing your search above and press return to search.
'బాహుబలి' నటుడి ఆరోగ్య పరిస్థితిపై లేటెస్ట్ అప్డేట్..!
By: Tupaki Desk | 10 Jan 2022 12:38 PM GMTకరోనా వైరస్ గత రెండున్నరేళ్లుగా మానవాళిని ముప్పుతిప్పలు పెడుతోంది. ఇప్పటికే మహమ్మారి ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్ వల్ల జరిగిన నష్టం నుంచి కోలుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో కోవిడ్ మరియు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మళ్లీ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుండటం ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది.
ఇక కరోనా మహమ్మారి సినీ ఇండస్ట్రీని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇప్పటికే ఎంతో మంది ప్రముఖులు పొట్టనబెట్టుకున్న ఈ వైరస్.. ఇండస్ట్రీలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా గత కొన్ని రోజులుగా వరుసపెట్టి సినీ ప్రముఖులకు కరోనా సోకుతుండటంతో సినీ అభిమానులను కలవరపెడుతోంది.
ఇటీవల తమిళ సీనియర్ నటుడు సత్యరాజ్ కోవిడ్-19 ఎఫెక్ట్ తో హాస్పిటల్ లో జాయిన్ అయ్యారనే సంగతి తెలిసిందే. పాజిటివ్ అని నిర్ధారణ అయిన తర్వాత కొన్ని రోజులు హోమ్ ఐసొలేట్ లో చికిత్స తీసుకున్న సత్యరాజ్.. కరోనా లక్షణాలు తీవ్రం అవడంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అయితే ప్రస్తుతం ఆయన పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగానే ఉందని కోలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
సత్యరాజ్ కు కరోనా ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉండడంతో కోలుకోవడానికి సమయం పడుతోందట. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. వైద్య బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.. ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలుస్తోంది. బాహుబలి నటుడు ఆసుపత్రిలో ఉండటంతో సినీ అభిమానులు ఆందోళనలో ఉన్నారు. సత్యరాజ్ కు కోలుకోవడానికి కొంచెం సమయం పట్టొచ్చు కానీ పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తారని సన్నిహితులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, 'బాహుబలి' సినిమాలో కట్టప్పగా ప్రేక్షకుల్లో ముద్రపడిన సీనియర్ నటుడు సత్యరాజ్.. తెలుగులో 'మిర్చి' 'నేను శైలజ' 'హైపర్' 'జెర్సీ' 'ప్రతిరోజూ పండుగే' వంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. అలానే ఆయన నటించిన 'పక్కా కమర్షియల్' 'రాధే శ్యామ్' వంటి సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.