Begin typing your search above and press return to search.

బాహుబలి హిందీ శాటిలైట్‌ రైట్స్‌ అంతా?

By:  Tupaki Desk   |   11 July 2015 12:17 PM IST
బాహుబలి హిందీ శాటిలైట్‌ రైట్స్‌ అంతా?
X
కరణ్‌ జోహార్‌ లాంటి పెద్ద నిర్మాత చేతిలో పడగానే బాహుబలి జాతకం మారిపోయింది. ఈ రోజు బాహుబలి హిందీ వెర్షన్‌ దేశవ్యాప్తంగా 1500కు పైగా థియేటర్లలో ఆడేస్తోందంటే.. దేశవ్యాప్తంగా ఈ సినిమా గురించి చర్చించుకుంటున్నారంటే.. అదంతా కరణ్‌జోహార్‌ చలవే. రానా దగ్గుబాటికి ఎవరు సలహా ఇచ్చారో కానీ.. కరణ్‌ జోహార్‌ ద్వారా బాహుబలి హిందీ వెర్షన్‌ రిలీజవడం మన అదృష్టమనే చెప్పాలి.

బాహుబలికి కరణ్‌ చేసిన సూపర్‌ ప్రమోషన్‌తో అక్కడ కూడా మంచి వసూళ్లే వస్తున్నాయి. హిందీ వెర్షన్‌ తొలి రోజు రూ.10 కోట్లకు పైనే వసూలు చేసినట్లు అంచనా. ఒక్క బాలీవుడ్‌ నటుడు కూడా లేని సౌత్‌ ఇండియన్‌ సినిమా ఈ స్థాయి వసూళ్లు రాబట్టడమంటే మామూలు విషయం కాదు. ఈ హైప్‌తో బాహుబలి హిందీ వెర్షన్‌ శాటిలైట్‌ రైట్స్‌ కూడా భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి.

రూ.17 కోట్లకు ఓ ఛానెల్‌ బాహుబలి శాటిలైట్‌ రైట్స్‌ తీసుకున్నట్లు అంచనా. కరణ్‌ జోహార్‌ హిందీ వెర్షన్‌ హక్కుల్ని ఎంత మొత్తానికి తీసుకున్నాడో తెలియదు కానీ.. ఈ సినిమా ద్వారా కనీసం రూ.50 కోట్ల దాకా రాబట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. హిందీ వెర్షన్‌ శాటిలైట్‌ రైట్సే అంత పలికితే.. మరి తెలుగు వెర్షన్‌ పరిస్థితేంటో!