Begin typing your search above and press return to search.
జపాన్ పండుగలో బాహుబలికి వాటా
By: Tupaki Desk | 1 Nov 2016 4:44 AM GMTబాహుబలి మూవీ సంచలనాలకు బ్రేక్ పడ్డం లేదు. బాహుబలి ది బిగినింగ్ రిలీజ్ అయ్యి 16 నెలలు పూర్తవడం.. రెండో భాగం సందడి కూడా మొదలైపోవడంతో.. మొదటి భాగంపై ఈ మధ్య జనాల కాన్సంట్రేషన్ కాస్త తగ్గింది. అయితే.. ఇంటర్నేషనల్ లెవెల్ లో మాత్రం ఇంకా ఈ చిత్రం సత్తా చాటుతూనే ఉంది.
ప్రపంచవ్యాప్తంగా పలు ఫిలిం ఫెస్టివల్స్ లో చోటు సంపాదించిన బాహుబలి ది బిగినింగ్.. ఇప్పుడు క్యోటో హిస్టారికా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లోనూ ప్రదర్శితం కానుంది. నవంబర్ 3న బాహుబలి ది బిగినింగ్ ప్రదర్శిస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. కేవలం ప్రదర్శన మాత్రమే కాకుండా.. ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ కూడా ఉంటుంది. బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ ఈ సెషన్ లో పాల్గొంటారు. ఇది కాకుండా జపనీస్ ఫిలిం స్టూడెంట్స్ కు.. ఈ ప్రొడ్యూసర్ ఒక మాస్టర్ క్లాస్ కూడా ఇవ్వనున్నారు. క్యోటో ఫిలిం ఫెస్టివల్ స్థానం పొందడం ద్వారా బాహుబలి ది బిగినింగ్ కు మరో అరుదైన గౌరవం దక్కుతున్నట్లయింది.
మరోవైపు.. బాహుబలి ది కంక్లూజన్ షూటింగ్ ను ఫినిషింగ్ దశకు తీసుకొచ్చాడు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. నవంబర్ చివరి వారం నాటికి షెడ్యూల్ ప్రకారం మొత్తం షూటింగ్ పూర్తి కానుండగా.. ఆ తర్వాత కేవలం పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రమే ఉంటాయి. గ్రాఫిక్స్ తో పాటు అన్ని భాషల్లోకి డబ్బింగ్ కూడా పూర్తి చేసి ఒకేసారి రిలీజ్ చేసేందుకు దాదాపు 6 నెలలు టైం కేటాయించిన జక్కన్న.. ఏప్రిల్ 28 2017న బాహుబలి ది కంక్లూజన్ ను విడుదల చేయనున్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/