Begin typing your search above and press return to search.
ఫోకస్: బాహుబలి మేనియా కాపాడేస్తోందంతే
By: Tupaki Desk | 26 July 2015 2:27 PM GMTగ్లోబలై జేషన్ తో ప్రపంచమంతా కుగ్రామంగా మారిపోయింది. ఎక్కడ ఏం జరిగినా క్షణాల మీద ప్రపంచానికి తెలిసిపోతోంది. అంతేకాదు హైదరాబాద్ సాఫ్ట్ వేర్ హబ్ గా ప్రపంచ స్థాయిలో ఎదిగింది. కానీ ఇక్కడ వినోద పరిశ్రమ మాత్రం దినదిన గండంలోనే కాలాన్ని గడుపుతోందంటే అతిశయోక్తి కాదు. ఈ రంగానికి ప్రభుత్వాలు చేస్తున్నది చాలా తక్కువ అన్న విమర్శలొస్తున్నాయి.
నిత్య జీవితంలో ఒత్తిళ్లను అధిగమించాలంటే వినోదం తప్పనిసరి. అంత కీలకమైన ఈ రంగం అధికారుల, రాజకీయనేతల అలసత్వానికి గురవుతున్నది అనడంలో సందేహమే లేదు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ సినిమా పరిశ్రమలో ఎలాంటి ఎదుగుదల ఉందనిని ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పలేని పరిస్థితి. రాజకీయనేతలంతా ఎవరికి వారు ప్రకటనలతో ప్రకంపనలు సృష్టించారే కానీ, మాటల్లో ఉన్నంత ప్రాక్టికాలిటీ చేతల్లో కనిపించనేలేదు. హైదరాబాద్ ని ఫిలింహబ్‌గా మారుస్తాం. స్టూడియోలు కడతాం. ఫిలిం ఇనిస్టిట్యూట్ పెడతాం.. అంటూ ఢాంబికాలు పలికారే కానీ, కనీసం సినిమా ఇంకా బతికే ఉంది అని చెప్పే ఒక్క అభివృద్ధి కూడా జరగనేలేదు. మునుముందు జరుగుతుందా? అంటే అందరూ నోళ్లు తెరిచే పరిస్థితి. ముఖ్యంగా ఇప్పటివరకూ ఇచ్చిన మౌత్ వర్డ్ ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకున్నా చాలా చేసినట్టే.
పన్ను మినహాయింపులు, లొకేషన్ల కోసం ఛార్జీల తగ్గింపు వంటి అంశాలు ఇంకా ఎన్నో సినిమాని నాశనం చేస్తున్న అంశాలు. వాటన్నిటిపైనే దృష్టి సారించే ఛాన్సుంటుంది. ఇకపోతే హైదరాబాద్ అతిపెద్ద సినిమా పరిశ్రమ అని ప్రపంచానికి చాటి చెప్పాలంటే నిత్యం ఇక్కడ ఫిలిం ఫెస్టివల్స్ తో హోరెత్తిపోవాలి. కానీ ఇటీవలి కాలంలో పరిస్థితి చూస్తుంటే అసలు ఇక్కడ పరిశ్రమ ఉందా అన్న సందేహమూ వస్తోంది. బాహుబలి మానియా సాగుతోంది కాబట్టి మనం ఉన్నామని ప్రపంచానికి తెలిసింది. లేదంటే ఇక అంతే సంగతి.