Begin typing your search above and press return to search.
బాహుబలి మళ్లీ వైరల్ అవుతున్నాడు
By: Tupaki Desk | 27 Nov 2022 10:00 PM ISTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి బాహుబలి సినిమా తో పాన్ ఇండియా స్థాయిలో స్టార్ డం దక్కిన విషయం తెలిసిందే. రికార్డు బ్రేకింగ్ కలెక్షన్స్ ని దక్కించుకున్న బాహుబలి సినిమా లోని ప్రతి ఒక్క ఎలిమెంట్ కూడా దేశ వ్యాప్తంగా సినీ అభిమానులకు మరియు సినీ వర్గాల వారికి నోటెడ్ అయింది.
సినిమా కు సంబంధించిన ప్రతి ఒక్క స్టిల్ కూడా సోషల్ మీడియా లో ఆ సమయంలో వైరల్ అయ్యాయి. అప్పుడు కొన్ని స్టిల్స్ విడుదల చేయకుండా దాచి ఉంచారు. వాటిని ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా విడుదల చేస్తున్నారు.
ఆ ఫొటోలు ఎప్పుడు షేర్ చేసినా కూడా అప్పటి మాదిరిగానే బాహుబలి స్టిల్స్ అంటూ మళ్ళీ వైరల్ అవుతున్నాయి. తాజాగా ప్రభాస్ బాహుబలి స్టిల్ కొత్తగా ఒకటి వచ్చి వైరల్ అవుతుంది. దీంట్లో ప్రభాస్ లుక్ చాలా కూల్ గా డీసెంట్ గా ఉందని ఆయన చిరునవ్వు నవ్వుతుంటే ఎంతో ఆహ్లాదంగా ఉందంటూ అభిమానులు ఈ ఫోటోను షేర్ చేసుకుంటూ తెగ ముచ్చటించుకుంటున్నారు.
ఈ బాహుబలి స్టార్ ప్రస్తుతం నాలుగైదు సినిమాలను లైన్లో పెట్టాడు, సలార్ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. వచ్చే నెలలో మారుతి దర్శకత్వంలో ఒక సినిమా రెండవ షెడ్యూల్ జరగబోతుంది. అంతే కాకుండా ప్రాజెక్ట్ కే.. స్పిరిట్ సినిమా లు కూడా లైన్లో ఉన్నాయి. ఇక ఆదిపురుష్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.