Begin typing your search above and press return to search.
అక్కడ బాహుబలి డీల్ ఓకే
By: Tupaki Desk | 5 Oct 2015 9:30 AM GMTటాలీవుడ్ - కోలీవుడ్ - బాలీవుడ్ - యుఎస్ (తెలుగు) బాక్సాఫీసుల్ని షేక్ చేసి వదిలిపెట్టిన బాహుబలి.. ఇంతటితో ఆగేలా లేడు. త్వరలోనే చైనాలో జక్కన్న టెక్నికల్ వండర్ జోరు చూపించడానికి రెడీ అవుతుండగా.. మరికొన్ని దేశాల్లోనూ ‘బాహుబలి’ ప్రదర్శనకు భారీగానే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటిదాకా తెలుగు సినిమా అడుగుపెట్టని దేశాల్లో బాహుబలి బ్యాంగ్ బ్యాంగ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. జపాన్ లో ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయడానికి డీల్ ఓకే అయింది.
ఇటీవలే బాహుబలిని బుసాన్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించారు. అక్కడ ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి అద్భుత స్పందన వచ్చింది. ఈ సందర్భంగానే జపాన్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ‘ట్విన్ కో’తో బాహుబలి నిర్మాత డీల్ ఓకే చేసుకున్నట్లు తెలిసింది. జపాన్ లో ఓ ఇండియన్ మూవీ ఏదీ కూడా విడుదల కానంత భారీ స్థాయిలో ‘బాహుబలి’ని విడుదల చేయబోతున్నట్లు తెలిసిందే. ఈ ఏడాది ఆఖర్లో బాహుబలి జపాన్ లో అడుగు పెట్టనుంది. మరోవైపు లాటిన్ అమెరికా - జర్మనీ - ఐరోపా ప్రాంతాల్లో కూడా బాహుబలిని రిలీజ్ చేయడానికి అక్కడి డిస్ట్రిబ్యూషన్ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నాడు శోభు యార్లగడ్డ.