Begin typing your search above and press return to search.

బాహుబలి క్రేజు.. కొత్త పుంతలు తొక్కింది

By:  Tupaki Desk   |   5 Dec 2017 10:43 AM GMT
బాహుబలి క్రేజు.. కొత్త పుంతలు తొక్కింది
X
వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఇండియన్ సినిమాలో ‘బాహుబలి’ సినిమాకు వచ్చినంత క్రేజు మరే సినిమాకూ రాలేదంటే అతిశయోక్తి కాదు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ సినిమా చర్చనీయాంశమైంది. మరే సినిమా చూడనంత మంది ఈ చిత్రాన్ని చూశారు. బాహుబలి క్రేజును వేరే రకంగా కూడా వాడుకోవడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి.

ఆ చిత్ర బృందం బాహుబలి గేమ్స్ తీసుకొచ్చింది. వీఆర్ వీడియోలు తెచ్చింది. వెబ్.. టీవీ సిరీస్ కు కూడా సన్నాహాలు చేస్తోంది. మరోవైపు బయటి వాళ్లు కూడా ‘బాహుబలి’ క్రేజును వాడేసుకుంటున్నారు. ‘బాహుబలి: ది కంక్లూజన్’ రిలీజైనపుడు ప్రభాస్-అనుష్కల ఫొటోల ప్రింటింగ్ తో వచ్చిన చీరలు భలే పాపులరైన సంగతి తెలిసిందే. ఇప్పుడు బాహుబలి జ్యువెలరీ కూడా అందుబాటులోకి వచ్చేసింది మార్కెట్లోకి.

‘బాహుబలి’ రెండు భాగాల్లో బాగా ఫేమస్ అయిన ఘట్టాల స్ఫూర్తితో నగలు డిజైన్ చేశారు. ‘బాహుబలి: ది బిగినింగ్’లో శివగామి బాహుబలిని చేతిలో ఎత్తుకుని నీటిలో మునిగే దృశ్యం.. ‘బాహుబలి: ది కంక్లూజన్’లో అమరేంద్ర బాహుబలి ఏనుగు ఎక్కే సీన్.. ఇదే సినిమాలో బాహుబలి సింహాసనం మీద కూర్చునే దృశ్యం.. వీటి స్ఫూర్తితో నగలు తయారయ్యాయి. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మరి ఈ నగలు జస్ట్ షో వరకే పరిమితం అవుతాయా.. వీటిని జనాలు కొంటారా అన్నది చూడాలి.