Begin typing your search above and press return to search.
ఈ బాహుబలి దాహం తీరనిదీ!!
By: Tupaki Desk | 25 April 2017 5:56 AM GMTతెలుగు రాష్ట్రాల్లో చిన్న సినిమా మేకర్స్.. థియేటర్స్ యజమానులు చాలా కాలంగా చేస్తున్న రిక్వెస్ట్.. రోజుకు ఐదు షోస్ వేసుకునేందుకు పర్మిషన్ ఇవ్వమనే. ఏ ప్రభుత్వం ఇప్పటివరకూ సానుకూలంగా స్పందించింది లేదు. కానీ భారీ సినిమా కావడం.. మేకర్స్ నుంచి పెరుగుతున్న ఒత్తిడితో బాహుబలి కోసం మాత్రం షోస్ కౌంట్ పెరిగింది.
తెలంగాణలో బాహుబలి2ను తొలి వారం రోజుల పాటు ఐదు షోస్ వేసుకోవచ్చు. ఏపీలో అయితే ఏకంగా ఆరు షోలను ప్రదర్శించేందుకు అనుమతులు ఇచ్చారు. ఓ సినిమా కోసం ప్రభుత్వాలు ఇంత ఉదారంగా ప్రవర్తించడం అన్ని సార్లు చూడలేం. కానీ బాహుబలి మేకర్స్ మాత్రం ఇక్కడితో సంతృప్తి చెందినట్లుగా కనిపించడం లేదు. తమ మొదటి డిమాండ్ అయిన టికెట్ రేట్ల పెంపును ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలపై టికెట్ రేట్ల విషయంలో గట్టిగానే ఒత్తిడి చేస్తున్నారట. అంటే.. ముందు ఎక్కువ షోస్ వేసుకునేందుకు పర్మిషన్ సంపాదించేసుకుని.. ఇప్పుడు ఎక్కువ టికెట్ రేట్ పెట్టి.. భారీగా లాగేలయానే ప్లాన్ అన్న మాట.
చాలామంది రిక్వెస్ట్ లను కాదని.. ఎట్టకేలకు ఎక్కువ షోస్ కు బాహుబలికి అనుమతి ఇస్తే.. దీన్ని కూడా సరిపెట్టుకునేటట్లుగా కనిపించడం లేదు బాహుబలి మేకర్స్. మరోవైపు ఇదే విషయంపై.. గతంలో అనుమతులు నిరాకరించిన సినిమాల లిస్ట్.. వారి వివరాలతో పాటు.. బాహుబలి2 కి మాత్రం ప్రభుత్వాలు స్పెషల్ పర్మిషన్ ఎలా ఇస్తాయంటూ.. ఓ లాయర్ కోర్టు మెట్లు ఎక్కుతున్నాడని అంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/