Begin typing your search above and press return to search.

బాహుబలి.. ఎట్టలకేలకు మెట్టు దిగాడు

By:  Tupaki Desk   |   1 July 2015 12:14 PM IST
బాహుబలి.. ఎట్టలకేలకు మెట్టు దిగాడు
X
పైసా ఖర్చు లేకుండా సినిమాను ఎలా ప్రమోట్‌ చేసుకోవాలో బాహుబలి టీమ్‌ చూపించింది. సోషల్‌ మీడియా పవర్‌ ఏంటో చాటి చెబుతూ సినిమాను అద్భుతంగా ప్రమోట్‌ చేసుకున్నారు రాజమౌళి అండ్‌ కో. ట్విట్టర్లో సినిమాకు సంబంధించి ఓ విశేషం వెల్లడైందంటే చాలు.. ముందుగా వెబ్‌ మీడియాలో, ఆ తర్వాత ఎలక్ట్రానిక్‌ మీడియాలో.. ఆపై ప్రింట్‌ మీడియాలో.. విస్తృతమైన ప్రచారం దక్కేది. దీంతో ఇప్పటిదాకా పబ్లిసిటీ మీద పైసా ఖర్చు పెట్టాల్సిన అవసరం రాలేదు.

ఐతే ఇది అన్ని సినిమాలకూ సాధ్యమయ్యే విషయమేమీ కాదు. బాహుబలికి సంబంధించిన ఏ న్యూస్‌నూ మీడియా విస్మరించలేని పరిస్థితి ఉంది కాబట్టే.. ఆ సినిమాకు అంత స్టామినా ఉంది కాబట్టే ఇంత ప్రచారం లభించింది. మీడియా కూడా ఆ సినిమాను ప్రమోట్‌ చేయడం ఓ బాధ్యతగా కూడా భావించింది. ఐతే సినిమా విడుదల టైంలో కూడా ఇలాగే సోషల్‌ మీడియా ప్రచారంతోనే సరిపెట్టేస్తారేమో.. ప్రకటనల మీద పైసా ఖర్చు పెట్టరేమో అనుకుంటుండగా ఎట్టకేలకు 'బాహుబలి' టీమ్‌ పబ్లిసిటీ మీద కొంత ఖర్చు పెట్టింది. ఈ రోజు అన్ని ప్రముఖ పత్రికల్లోనూ 'బాహుబలి' రిలీజ్‌ డేట్‌ యాడ్‌ వచ్చింది. ఇప్పటికీ ఇలా ప్రకటనలు ఇవ్వాల్సిన అవసరం లేకపోయినప్పటికీ.. ఇన్నాళ్లుగా అందించిన సహకారానికి కృతజ్ఞతగానో.. లేకుంటే మారు మూల పల్లెలకూ సినిమా చేరాలన్న ఉద్దేశంతోనో.. ప్రింట్‌ మీడియాలో యాడ్స్‌ ఇచ్చారు. రిలీజ్‌ డేట్‌ దగ్గరపడే కొద్దీ పబ్లిసిటీ ఇంకొంచెం పెంచే అవకాశముంది.