Begin typing your search above and press return to search.

ఇండియా నెంబర్ వన్.. బాహుబలి

By:  Tupaki Desk   |   3 Aug 2015 11:22 AM GMT
ఇండియా నెంబర్ వన్.. బాహుబలి
X
పీకే 730 కోట్లతో సింహాసన్ కూర్చుని ఉంటే.. బాహుబలి ఎలా నెంబర్ వన్ అవుతుందని ఆశ్చర్య పోకండి. ఓవరాల్ కలెక్షన్లలో పీకేదే రికార్డు కావచ్చు. బాహుబలి ఇంకా 500 కోట్ల క్లబ్ లో కూడా చేరకపోవచ్చు. కానీ ఇండియా నెంబర్ వన్ బాహుబలే అనే విషయంలో సందేహమే లేదు. వరల్డ్ వైడ్ కలెక్షన్ల లెక్కల్లో ‘పీకే’నే నెంబర్ వన్. ఆ లెక్కల్లో బాహుబలి ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది. కానీ దేశీయ వసూళ్లలో మాత్రం బాహుబలి ‘పీకే’ను కొట్టేసి నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించేసింది. 24 రోజుల అనంతరం బాహుబలి ఇండియా వరకు రూ.345 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. దీంతో 337 కోట్లతో ఉన్న పీకే రెండో స్థానానికి పడిపోయింది.

బాహుబలి తర్వాతి వారం విడుదలై దాని కంటే ముందే రూ.500 కోట్ల క్లబ్ లో చేరిపోయిన సల్మాన్ సినమా ‘భజరంగి భాయిజాన్’ దేశీయ నెట్ వసూళ్లు ఇంకా రూ.250 కోట్లే. ఆ సినిమా రూ.300 కోట్ల క్లబ్ లో కూడా చేరకపోవచ్చు. కాబట్టి ‘బాహుబలి’ రికార్డుకు ఇప్పుడిప్పుడే ముప్పు లేకపోవచ్చు. హిందీ సినిమాలకు విదేశీ మార్కెట్ ఎక్కువ కాబట్టి వాటికి ఓవర్సీస్ వసూళ్లు భారీగా ఉంటాయి. పీకే సినిమా విదేశాల్లో భారీ స్థాయిలో విడుదలైంది. కొంచెం గ్యాప్ తర్వాత చైనాలో విడుదలై అక్కడా వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. రూ.730 కోట్లలో సగం విదేశాల నుంచి వచ్చినవే. కానీ బాహుబలి మాత్రం మనదేశంలో కనీవినీ ఎరుగని వసూళ్లు సాధించింది. అందులోనూ ఓ రీజనల్ మూవీ ఈ స్థాయిలో వసూళ్లు సాధించి.. నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించడం చిన్న విషయం కాదు.