Begin typing your search above and press return to search.
బాహుబలి ఫస్ట్ డే టార్గెట్ ఎంత?
By: Tupaki Desk | 30 Jun 2015 9:40 PM ISTబాలీవుడ్ సినిమాలకు వంద కోట్ల క్లబ్‌లో చేరడం చాలా చిన్న విషయం. మరోవైపు తమిళ సినిమా కూడా ఎప్పుడో వంద కోట్ల మార్కును అందుకుంది. ఐతే తమిళనాడుతో పోలిస్తే మనకు ఎక్కువ థియేటర్లే ఉన్నాయి. మార్కెట్ కూడా బాగానే ఉంది. అయినా ఇప్పటిదాకా వంద కోట్ల సినిమా ఒక్కటీ లేదు. అత్తారింటికి దారేది అత్యధికంగా రూ.86 కోట్ల దాకా వసూలు చేసి అగ్రస్థానంలో ఉంది. ఐతే బాహుబలి సినిమా వంద కోట్ల మార్కును అందుకోవడం ఖాయమని అంచనా. అన్ని భాషల్లో కలుపుకుంటే తొలి భాగమే రూ.150 కోట్లు వసూలు చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కేవలం తెలుగు వెర్షన్ మాత్రమే వంద కోట్ల మార్కు అందుకుంటుందని రాజమౌళి అండ్ కో కాన్ఫిడెంట్‌గా ఉంది.
బాహుబలి ఎంత కలెక్ట్ చేస్తుందనేది ఓపెనింగ్స్ మీదే ఆధారపడి ఉంది. తొలి మూడు రోజుల్లో ఎంత వసూలు చేస్తుందన్నదాన్ని బట్టే సినిమా రేంజిని అంచనా వేయొచ్చు. ఐతే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 80-90 శాతం థియేటర్లలో బాహుబలి ప్రదర్శిస్తారని అంటున్నారు కాబట్టి తొలి వీకెండ్‌లో కళ్లు చెదిరే కలెక్షన్లు రావడం ఖాయం. అందులోనూ తొలి రోజైతే కనిపించే ప్రతి థియేటర్లోనూ బాహుబలి సినిమానే ప్రదర్శిస్తే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. తొలి రోజు వసూళ్లలో కూడా అత్తారింటికి దారేది సినిమాదే రికార్డు. ఆ సినిమా రూ.14 కోట్ల దాకా వసూలు చేసింది. ఐతే ఇది వరల్డ్ వైడ్ కలెక్షన్స్. ఐతే బాహుబలి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వరకే రూ.15 కోట్ల మార్కును సునాయాసంగా దాటేయడం ఖాయం. ఇక ప్రపంచవ్యాప్తంగా తెలుగు వెర్షన్ తొలి రోజు కలెక్షన్లు రూ.20 కోట్లు దాలొచ్చేమో. అన్ని భాషల్లో కలిపితే బాహుబలి బాలీవుడ్ సినిమాలకు దీటుగా నిలవొచ్చు. రూ.30 కోట్లకు తక్కువైతే కాకపోవచ్చు.