Begin typing your search above and press return to search.

ఫోకస్‌: బాహుబలికే రికార్డులు దాసోహం

By:  Tupaki Desk   |   13 July 2015 4:05 AM GMT
ఫోకస్‌: బాహుబలికే రికార్డులు దాసోహం
X
ఇప్పటివరకు టాలీవుడ్‌లో రికార్డుల పరిస్థితి ఒక లెక్క, ఇప్పుడొక లెక్క. అత్యధిక నెంబర్‌ ఆఫ్‌ ధియేటర్స్‌లో విడుదలైంది కాబట్టి, సినిమాకు ఈ రికార్డుల పర్వం గ్యారెంటీ అని ట్రేడ్‌ పండితులు ముందే చెప్పారు. కాని ఈ ధియేటర్ల సంఖ్య అనేది తొలిరోజునే వర్తిస్తుంది.. మిగిలిన రోజుల్లో కేవలం సినిమా స్టామినా మీదనే సినిమా తాలూకు కలెక్షన్లు ఆధారపడి ఉంటాయ్‌.

''బాహుబలి''.. కేవలం ఇండియాలోనే కాదు.. హాలీవుడ్‌లోని క్రిటిక్స్‌ కూడా హిందీ వర్షెన్‌ సినిమాను చూసి అవాక్కయ్యారు. ఈ సినిమా ఖచ్చితంగా 300, లార్డ్‌ ఆఫ్‌ ది రింగ్స్‌ షేడ్స్‌ ఉంటుందేమో అనుకుంటే.. ఇక్కడ చాలా కొత్తగా ఇండియనైజ్డ్‌ అవుట్‌పుట్‌ కనిపించింది. మనోళ్ళకి కిక్కివ్వని సాఫ్ట్‌ రొమాన్స్‌, వార్‌ సీన్స్‌, అసంపూర్ణమైన క్లయ్‌మ్యాక్స్‌ వాళ్ళకు నచ్చేసింది. బాలీవుడ్‌లోనే ఇదే పరిస్థితి. వెరసి సినిమాకు గడచిన మూడు రోజుల్లో షుమారు 160 కోట్ల గ్రాస్‌ కలెక్షన్‌ వచ్చేసింది. ఇండియాలో హ్యాపీ న్యూ ఇయర్‌ (42 కోట్ల నెట్‌ ఫస్ట్‌ డే) వంటి సినిమా రికార్డును 42.1 కోట్ల రూపాయల నెట్‌ వసూలు చేసి తొలిరోజు కొల్లగొడితే.. మూడు రోజుల్లో తెలుగు వర్షెన్‌ షుమారు 75 కోట్ల షేర్‌ రాబట్టి అత్తారింటికి దారేది లైఫ్‌ టైమ్‌ ఇండస్ట్రీ హిట్‌ను బీట్‌ చేసింది బాహుబలి.

ఇండియాలో విడుదలైన తెలుగు, తమిళ్‌, మలయాళం, హిందీ వర్షెన్లు కలుపుకొని సౌత్‌లో లింగా, రోబో వంటి సినిమాలను తొలిరోజే బీట్‌ చేసిందంటే చూస్కోండి మరి. ఇకపోతే బాలీవుడ్‌లో హిందీ వర్షెన్‌ తొలిరోజున 5.15 కోట్ల నెట్‌ వసూలు చేసిన సినిమా, శనవారం 40% హెచ్చుతో 7.09 కోట్లు వసూలు చేసింది. ఇదే షాకింగ్‌ అనుకుంటే, ఆదివారం నాడు 9.8 కోట్లు నెట్‌ వసూళ్ళు చేసిందీ జక్కన్న అద్భుత సృష్టి. అమెరికా బాక్సాఫీస్‌ దగ్గర కూడా తెలుగు వర్షెన్‌ చెక్కుతున్న రికార్డులకు లెక్కేలేదు. జూలై 9న వేసిన ప్రీమియర్లతోనే సినిమా రఫ్ఫాడిస్తే.. మొత్తాంగా మూడు రోజులకూ కలుపకొని రెంట్రాక్‌ వారు అందించిన వివరాల ప్రకారం బాహుబలి: ది బిగినింగ్‌ 4.39 మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది. ఇవన్నీ సరిక్రొత్త రికార్డులే. మండే నుండి భారీ డ్రాప్స్‌ ఏమీ లేవు. మల్టీప్లెక్సులన్నీ ఈ వారం అంతటికీ టిక్కెట్లు అమ్మేశాయ్‌. సింగిల్‌ స్క్రీన్స్‌లో కూడా దాదాపు 90% ఆక్యుపెన్సీ రేట్‌ ఉంది. సో, ఎలా చూసినా కూడా సినిమా తొలివారం పూర్తయ్యేనాటికి సరిక్రొత్త రికార్డులను తిరగరాసేలా ఉంది. ముఖ్యంగా 300 కోట్ల గ్రాస్‌ మార్కును దాటే ఛాన్సుంది.

మన సౌత్‌ సినిమాల గ్రాస్‌ వసూళ్ళను చూసుకుంటే తమిళ సినిమా ఎన్థిరన్‌ (రోబో) తెలుగు, తమిళం, హిందీ లాంగ్వేజస్‌లో కలుపుకొని 289 కోట్లు గ్రాస్‌ ఫుల్‌ రన్‌లో వసూలు చేసింది. 'ఐ' సినిమా 239 కోట్లు, శివాజీ సినిమా 155 కోట్లు వసూలు చేశాయి. ఇప్పటికే బాహుబలి ఈ లిస్టులో శివాజీ సినిమాను క్రిందకు తోసేసి మూడో స్థానంలో ఉంది, త్వరలో ఈ టేబుల్‌లో టాప్‌కు రావడం గ్యారంటీ.. అయితే 300 కోట్లు మార్కును దాటితే మాత్రం అది రికార్డే. ముఖ్యంగా ఒక తెలుగు సినిమాతో ఈ ఫీట్‌ చేయడం అనేది అత్యధ్భుతం.