Begin typing your search above and press return to search.
బాహుబలి టికెట్లు.. కావాల్సినన్ని ఉన్నాయి
By: Tupaki Desk | 9 July 2015 9:00 AM GMTబాహుబలి టికెట్ సంపాదించినవాడిని ఇప్పుడు పెద్ద అచీవర్‌లా చూస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో. తెలుగు సినిమా చరిత్రలోనే ఎప్పుడూ ఏ సినిమాకూ లేనంత డిమాండ్ ఉంది బాహుబలి టికెట్ల కోసం. ఒక టికెట్ ఐదొందలన్నా ఏమాత్రం ఆలోచించకుండా కొనేస్తున్నారు జనాలు. ట్విట్టర్లో బాహుబలి టికెట్లకు వేలం పాట కూడా నడుస్తుండటం విశేషం. ఐతే మనదగ్గర బాహుబలి టికెట్ల కోసం ఇంతగా కొట్టుకుంటున్నారు కానీ.. వేరే నార్త్ ఇండియాలో మాత్రం మన సినిమాకు ఇంత డిమాండ్ లేదు. కరణ్ జోహార్ హిందీ వెర్షన్‌ను బాగానే ప్రమోట్ చేశారు.. హైప్ తీసుకొచ్చారు కానీ ఎంతైనా సౌత్ ఇండియన్ మూవీ కదా అనేమో అక్కడి జనాలు 'బాహుబలి'ని కొంచెం చిన్నచూపే చూస్తున్నట్లున్నారు.
బుక్‌మై షోలో రెండు రోజుల కిందట హిందీ వెర్షన్ బుకింగ్స్ మొదలయ్యాయి. ఐతే అక్కడ రెస్పాన్స్ అనుకున్న స్థాయిలో లేదు. ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా లాంటి ప్రధాన నగరాల్లో 'బాహుబలి' బుకింగ్స్ ఓ మోస్తరుగా ఉన్నాయి. సగం టికెట్లు తెగడం కూడా కష్టంగా ఉంది. ముంబయిలో అయితే కొన్ని థియేటర్లలో 25 పర్సంట్ ఆక్యుపెన్సీ కూడా లేదు. ఢిల్లీలో కూడా అలాంటి పరిస్థితే ఉంది. నార్త్‌లో ఇంకొంచెం పైకి వెళ్తే పరిస్థితి ఏమాత్రం బాగా లేదు. ఈశాన్య రాష్ట్రాల సంగతైతే చెప్పనక్కర్లేదు. దేశవ్యాప్తంగా హిందీ వెర్షన్‌ను దాదాపు 1500 థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఐతే విడుదల తర్వాత మౌత్ టాక్‌ను బట్టి థియేటర్లు నిండుతాయేమో చూడాలి.