Begin typing your search above and press return to search.

ఆన్ లైన్ లో హై క్వాలిటీ ప్రింట్

By:  Tupaki Desk   |   29 Oct 2015 5:30 PM GMT
ఆన్ లైన్ లో హై క్వాలిటీ ప్రింట్
X
బాహుబలి.. భారీ బడ్జెట్ తో భారీ వసూళ్లను సాధించి.. భారతీయుల సత్తాని ప్రపంచానికి చాటిన చిత్రం ఇది. ఇలాంటి మూవీస్ కి ప్రచారం నుంచి పైరసీ వరకూ అనేక జాగ్రత్తలు తీసుకుంటారు మేకర్స్. రిలీజ్ అయిన కొత్తలో పైరసీని ఆపలేకపోయినా.. వీలైనంత వరకూ ప్రతిఘటించాడు దర్శకధీరుడు రాజమౌళి. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. ఇంటర్నెట్ లో ఏ క్వాలిటీ కావాలంటే ఆ నాణ్యతతో ప్రింట్స్ దొరికేస్తున్నాయి.

రిలీజైన తెల్లారే టోరెంట్ లో ప్రింట్ వచ్చేసే ఈ రోజుల్లో.. నెలల తర్వాత ప్రింట్ రావడం పెద్ద విషయం కాదు. కానీ ఇప్పుడు ఆన్ లైన్ లో ఉన్న ప్రింట్ చూస్తే.. ఇది ఒరిజినల్ అనిపించక మానదు. కానీ ఇలా డౌన్ లోడ్స్ అవుతున్నది నిజమైన ప్రింట్ కాదు. పైరసీయే అని తెలుసుకోవాలి. నిజానికి ఇలాంటి హై క్వాలిటీ ప్రింట్ నెట్ లో దర్శనమివ్వడానికి పలు కారణాలున్నాయి. మూవీ రిలీజ్ అయిన నెల రోజులకే డీవీడీ - బ్లూరే ప్రింట్స్ ను ఆన్ లైన్ లో విక్రయించేశారు. తాజాగా దసరా పండక్కి అన్ని భాషల్లోనూ టీవీల్లో కూడా దర్శనమిచ్చేసింది బాహుబలి. దీంతో పైరసీ చేయడం ఈజీ అయిపోయింది.

డీటీహెచ్ లలో వేసే స్పెషల్ షోలను మినహాయిస్తే.. మిగతవాటిని తేలికగానే రికార్డ్ చేసేసుకోవచ్చు. అందుకే ఇలా హెచ్ డీ ప్రింట్ నెట్ లోకి వచ్చింది. ఇప్పటికే బాహుబలికి పెట్టుబడికి మించిన పలు రెట్లు ఆదాయం వచ్చేయడంతో... దీన్ని పట్టించుకోవడం లేదు. కానీ ఈ డూప్లికేట్ ప్రింట్స్ కారణంగా రైట్స్ తీసుకుని అమ్మకాలు చేసే వాళ్లకు పెద్ద మొత్తంలోనే నష్టం వాటిల్లుతుంది.