Begin typing your search above and press return to search.
సెవెన్ మిలియన్ క్లబ్ ఊరిస్తోంది
By: Tupaki Desk | 24 July 2015 10:11 AM GMTఒకప్పుడు తెలుగు సినిమా యుఎస్ లో మిలియన్ క్లబ్ లో చేరితేనే ఔరా అనుకున్నాం. రెండు మిలియన్ల క్లబ్ లో మన సినిమా ఎప్పుడు చేరుతుందా అని చాన్నాళ్లుగా ఎదురు చూస్తున్నాం. కానీ ఇప్పుడు తెలుగు సినిమా ఏకంగా ఏడు మిలియన్ల క్లబ్ మీద కన్నేసింది. బాహుబలి 2 మిలియన్ క్లబ్ లో చేరుతుందని ఎవరికీ సందేహాలు లేవు. కుదిరితే 3 మిలియన్ క్లబ్ లో చేరినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదనుకున్నాం. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా ఈ సినిమా ఏకంగా 7 మిలియన్ క్లబ్ లో చేరబోతోంది. ఫస్ట్ వీకెండ్ లో బాహుబలి జోరు చూశాక.. ఈ సినిమా 5 మిలియన్ క్లబ్ లో చేరుతుందని.. అది గొప్ప రికార్డని అనుకున్నారంతా.
కానీ ఫస్ట్ వీక్ లోనే 5 మిలియన్ క్లబ్ లో అడుగుపెట్టి ఔరా అనిపించిన బాహుబలి.. ఆ తర్వాత కూడా ప్రభంజనం కొనసాగించి.. రెండు వారాలు ముగిసేసరికి 6.85 మిలియన్ డాలర్లు కొల్లగొట్టింది. ఇందులో తెలుగు వెర్షన్ సాధించిన వసూళ్లు 6.25 మిలియన్లు. అంటే రూ.39.4 కోట్లు. తమిళ వెర్షన్ 0.6 మిలియన్ (రూ.3.6 కోట్లు) వసూలు చేసింది. ఈ వీకెండ్ అయ్యేసరికి 7 మిలియన్లు దాటిపోవడం ఖాయం. ఫుల్ రన్ లో 8 మిలియన్ క్లబ్ లో కూడా చేరినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. మన రూపాయల్లో చెప్పాలంటే బాహుబలి ఇప్పటిదాకా 43 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇందులో షేర్ రూ.31 కోట్లు. ఐతే బాహుబలి యుఎస్ రైట్స్ అమ్మింది రూ.12 కోట్లకే కావడం విశేషం. అంటే పెట్టుబడికి దాదాపు మూడు రెట్ల దాకా ఆదాయమన్నమాట.