Begin typing your search above and press return to search.
బాహుబలి అక్కడ ఇంకా అమ్ముడవలేదు..
By: Tupaki Desk | 3 Sep 2015 11:22 PM GMT ఎన్నో ఏళ్ళుగా రాజ్యమేలిన తెలుగు సినిమాలకు సంబంధించిన దాదాపు అన్ని రికార్డులను సునామీలా వచ్చి చెరిపేసిన చిత్రం బాహుబలి. సినిమా కొబ్బరికాయ దగ్గర నుండీ గుమ్మడికాయ వరకూ ఎంతో జాగ్రత్తతో ప్రచారంలో ఏ మాత్రం తగ్గకుండా విజువల్ వండర్ అందించిన చిత్ర బృందం శ్రమకు తగ్గ ఫలితమే దక్కింది. అయితే విడుదలైన ప్రతీ చోటా భీభత్సంగా అమ్ముడుపోయిన బాహుబలి బుల్లితెరపై మాత్రం ఇంకా 'అన్ సొల్ద్' దశలోనే వుంది.
అవును, మీరు విన్నది నిజమే.. విడుదలకాకుండానే మంచి ధరకు శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుంటున్న ఈ రోజుల్లో బాహుబలి హక్కులు మాత్రం ఇంకా నిర్మాతల దగ్గరే వుండిపోయాయి. ఈ సినిమా విజయాన్ని దృష్టిలోపెట్టుకుని నిర్మాతలు అడుగుతున్న ధరే ఈ జాప్యానికి కారణమని సమాచారం. ప్రస్తుతం రెండు పెద్ద ఛానల్ సంస్థలు చిత్ర బృందంతో బేరసారాలు సాగిస్తుందట.
ఇదిలా వుంటే మంచి ఫ్యాన్సీ ధర పలికితే బాహుబలి 1 మరియు 2 పార్ట్లు కలిపి హక్కులను అప్పగించే యోచనలో జక్కన్న వున్నాడట. షూటింగ్ కి ఆ డబ్బులు ఒపయోగపడతాయని భావిస్తున్నాడట. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 600కోట్లను సంపాదించిన ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది.