Begin typing your search above and press return to search.
బాహుబలి.. రొటీన్ ఫ్లాష్‌బ్యాక్?
By: Tupaki Desk | 8 Jun 2015 1:00 PM ISTతెలుగు సినిమా ఫార్ములా ఏంటి? అని సామాన్య జనాల్ని ప్రశ్నించినా ఇట్టే సమాధానం చెప్పేస్తారు. అనగనగా ఒక సింపుల్ హీరో. అతడిలో ఏదో అనుచిత ప్రవర్తన.అతడు చేసే ప్రతి పనీ ఎందుకోసం అనేది ఎవరికీ అర్థం కాదు. అయితే ఒకానొకరోజు అతగాడి రహస్యం ఫ్లాష్‌బ్యాక్‌లో రివీల్ అయిపోతుంది. అప్పుడు మొదలవుతుంది అసలు కథ.
ఇదంతా రొటీన్ తెలుగు సినిమా ఫార్ములా. ఎప్పట్నుంచో అనుసరిస్తున్నదే. హాలీవుడ్‌లో వచ్చిన బోర్న్ సిరీస్ సినిమాల్లాగానో, ఇన్‌సెప్షన్, సోర్స్‌కోడ్ తరహాలోనో కొత్త పంథా స్క్రీన్‌ప్లేలకు వెళ్లాలంటే మనవాళ్లకు ధైర్యం చాలదు. అయితే సరిగ్గా ఇదే భయంతో రాజమౌళి కూడా రొటీన్ తెలుగు సినిమాటిక్ ఫార్ములానే అనుసరించాడని అంటున్నారు. బాహుబలి చిత్రంలో ఓ ఫ్లాష్‌బ్యాక్ ఉంటుంది. అది బాహుబలి రెండో భాగంలో రివీల్ అవుతుంది. మొదటి భాగంలో ఓ యంగ్ ప్రభాస్.. అతడికో లవరు (తమన్నా). ఈ ఇద్దరిమధ్యా ప్రేమాయణం.. ఈలోగానే కోటలపై దాడులు, యుద్ధాలు.. ఇవన్నీ చూపించాడు రాజమౌళి. క్లయిమాక్స్‌కి వచ్చేప్పటికి అసలు బాహుబలి ఎవరు? అన్నది రివీల్ చేస్తాడు. రెండో భాగంలో అరివీర భయంకరుడు, పరాక్రమవంతుడు అయిన సిసలైన బాహుబలి యాక్షన్ ఎపిసోడ్స్ వస్తాయని చెబుతున్నారు.
ప్రభాస్‌లోని అసలు మాస్‌యాక్షన్ రాజాని రెండో భాగంలోనే దించుతారట. ఇదంతా ఫ్లాష్‌బ్యాక్‌లో నడిచే కథ అని చెబుతున్నారు. బాహుబలి : ది బిగినింగ్ జూలై 10న రిలీజ్. అంతవరకూ మిగతా విషయాలన్నీ సస్పెన్స్. అప్పటివరకు ఇసనిమా గురించి ఇలాంటి కథలెన్ని తెలిసినా మనం వినాల్సిందే..