Begin typing your search above and press return to search.
బాహుబలి బడ్జెట్ 220 కోట్లు
By: Tupaki Desk | 12 April 2015 3:30 PM GMTబాహుబలి బడ్జెట్ వంద కోట్లని అంటేనే ఆశ్చర్యపోయాం. కానీ ఆ లెక్కలు అంతకంతకూ పెరిగి 220 కోట్లకు చేరాయి. ఈ ఫిగర్ విని అంతా ఉత్తిదే అనుకుంటాం కానీ.. స్వయంగా నిర్మాత శోభునే చెప్పాడు బాహుబలి బడ్జెట్ రూ.220 కోట్లని. బాహుబలి ప్రాజెక్టు వెనుక ఆసక్తికర సంగతుల్ని శోభు ఓ మీడియా సంస్థతో వెల్లడించాడు.
''ప్రభాస్ హీరోగా రాఘవేంద్రరావుగారి నిర్మాణంలో రాజమౌళి ఓ సినిమా చేయాలనుకున్నారు. అప్పటికే మేం రాజమౌళితో మర్యాదరామన్న చేశాం. బాహుబలి భారీ బడ్జెట్ మూవీ కావడంతో మేం కూడా అందులో భాగస్వాములు కావాలనుకున్నాం. కానీ చివరికి మా బ్యానర్‌లోనే సినిమా తీసేలా ఒప్పందం కుదిరింది. రాజమౌళి, విజయేంద్రప్రసాద్ రెండు మూడు సబ్జెక్టులు అనుకుని.. చివరికి బాహుబలిని ఖరారు చేశారు. ఇది పూర్తిగా ఊహాత్మక కథ.
కథలో ఉండే ప్రతి ఒక్కరి వేషధారణ, ఆయుధాలు, లొకేషన్ అన్నీ కంప్యూటర్‌లో డిజైన్ చేసి ఒక బౌండ్ బుక్ తయారు చేశాం. దాని ఆధారంగా చేసుకుని చిత్రీకరణ చేస్తూ వచ్చాం. ఇప్పటిదాకా ఎవరూ వేయనన్ని భారీ సెట్లు వేశాం. భారీ గ్రాఫిక్స్ వాడాం. సౌండ్ ఎఫెక్ట్ సహా ప్రతి సాంకేతికాంశంలోనూ ప్రత్యేకత చూపించాం. ప్రపంచ స్థాయి నిపుణులతో పని చేయించాం. అందుకే బడ్జెట్ భారీగా అయింది. రెండు భాగాలకు కలిపి రూ.220 కోట్ల బడ్జెట్ అయింది. హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నాం'' అని చెప్పారు శోభు.