Begin typing your search above and press return to search.
బాహుబలి ప్రపంచంలో 500వ స్థానంలో?
By: Tupaki Desk | 28 July 2015 5:50 PM GMTపీకే రికార్డు 600కోట్లు. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో కలుపుకుని ఈ సినిమా సాధించిన గ్రాస్ ఇది. అయితే ఈ రికార్డును కొట్టేసే సినిమాగా బాహుబలి ముందుకు కదులుతోంది. ఇప్పటికే 18రోజుల్లో 430కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం ఫుల్ రన్ లో 500కోట్లు అధిగమిస్తుందన్న అంచనాలున్నాయి. ఇది కేవలం దేశం లోపల సాధించే మొత్తం.
ఇక పొరుగు దేశాల్లో రిలీజ్ చేస్తే 600కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందని అంచనాలేస్తున్నారు. ఆ లెక్కన పీకే రికార్డుల్ని తిరగరాసినట్టే. దేశంలోనే నంబర్ 1 వసూళ్లు సాధించిన సినిమా ప్రపంచంలోనే టాప్ వసూళ్ల జాబితాలో 500వ స్థానం దక్కించుకునే ఆస్కారం ఉంది. ఆ లెక్కన బాలీవుడ్ ని కొట్టే సినిమా ఇంతకాలానికి వచ్చిందనే చెప్పాలి. అది ఓ తెలుగు సినిమా అని గర్వంగా చెప్పుకునే రోజొచ్చింది. ఇదంతా జక్కన్న వల్లే సాధ్యమైంది. రాజమౌళి సిసలైన యోధుడు. ప్రభాస్, రానాల ఖ్యాతిని ప్రపంచ విఖ్యాతం చేసిన ఘనుడు అతడు.
బాహుబలి : ది బిగినింగ్ .. ఈ స్థాయి రికార్డుల్ని సృష్టిస్తే ఇక బాహుబలి 2 ఏ రేంజులో రికార్డులకు తెర తీస్తుందో వేచి చూడాలన్న ఆసక్తి అందరిలో పెరుగుతోంది. అవతార్ వచ్చాక అవతార్ 2 ఎప్పుడొస్తుందా? అని ఎదురు చూసిన జనం ... ఇప్పుడు అంతే ఆసక్తిగా బాహుబలి : ది కన్ క్లూజన్ కోసం ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. 2016 చివరిలో ఆ సినిమా వచ్చే అవకాశం ఉంది..