Begin typing your search above and press return to search.

అలర్ట్: జక్కన్నకు వార్నింగ్ బెల్

By:  Tupaki Desk   |   14 Dec 2016 4:23 PM GMT
అలర్ట్: జక్కన్నకు వార్నింగ్ బెల్
X
బాహుబలి మూవీ తీయడం ఒకెత్తు అయితే.. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రాజమౌళి అండ్ టీం పన్నిన ఎత్తుగడలు.. అవలంబించిన వ్యూహాలు మరొక ఎత్తు. ముఖ్యంగా బాహుబలి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన తర్వాత ఒకో కేరక్టర్ ను కొన్ని రోజుల గ్యాప్ తో పరిచయం చేస్తూ.. దాదాపు నెల రోజుల పాటు ప్రేక్షకులకు ఊపిరి ఆడకుండా ఉత్కంఠకు గురి చేశాడు రాజమౌళి.

ఇప్పుడు బాహుబలి ది కంక్లూజన్ విషయంలో దాదాపు ఇదే స్ట్రాటజీ అవలంబించేస్తున్నారు. నెలన్నర క్రితం బాహుబలి ఫస్ట్ లుక్ కోసం ముంబైలోని ఈవెంట్ లో భారీ హంగామా చేసి.. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా మహేంద్ర బాహుబలి పోస్టర్ రిలీజ్ చేశారు. చేతిలో చైన్స్ లో కండలు తిరిగిన ప్రభాస్ కనిపిస్తాడంతే. చాలామంది ఈ పోస్టర్ చూసి నిరుత్సాహపడ్డా అప్పటివరకూ ఉన్న హైప్ కారణంగా.. అంతో ఇంతో సరిపెట్టుకున్నారంతా. ఇప్పుడు రానా దగ్గుబాటి పుట్టిన రోజు పురస్కరించుకుని.. భల్లాలదేవ పోస్టర్ ని నెట్ లో రిలీజ్ చేయడమే కాకుండా.. 'బలశాలి భల్లాలదేవ అంతం చేయడానికి వస్తున్నాడు' అంటూ పోస్ట్ చేశారు.

అయితే.. ఈ పోస్టర్ పై విపరీతమైన విమర్శలు వస్తున్నాయి. నాసిరకం గ్రాఫిక్స్ తో ఐరన్ మ్యాన్ కి భల్లాల ఫేస్ అతికించినట్లుగా ఉన్న ఈ భల్లాలదేవుడి పోస్టర్ దాదాపు ఎవరికీ నచ్చలేదు. నెటిజన్లు అప్పటికప్పుడే విరుచుకుపడ్డం మొదలుపెట్టారు. 'ఏ పల్లెటూళ్లో చేయించారో'.. 'ఐరన్ మ్యాన్ కి పసుపు సూట్ వేశారా'.. 'ఫ్యాన్ మేడ్ లా ఉందంతే'.. ఇలాంటి ట్రాలింగ్ కూడా మొదలైపోయింది.

బాహుబలి మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకూ ఈ రేంజ్ ట్రాలింగ్ ఇదే మొదటిసారి అని చెప్పాలి. మొత్తానికి.. బాహుబలి ది బిగినింగ్ వ్యూహం.. బాహుబలి ది కంక్లూజన్ కు వర్కవుట్ అయ్యేట్లుగా కనిపించడం లేదు. ఈ పబ్లిసిటీ విషయంలో అలర్ట్ తీసుకోకపోతే.. తేడా వచ్చేస్తుందేమో జక్కన్నా!!


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/