Begin typing your search above and press return to search.

ఏషియన్ అవార్డ్స్ లో బాహుబలి

By:  Tupaki Desk   |   5 Feb 2016 7:30 AM GMT
ఏషియన్ అవార్డ్స్ లో బాహుబలి
X
బాహుబలి రికార్డులు ఓ ఫైనల్ కౌంట్ వరకూ వచ్చేశాయి. ఇకపై బాహుబలి ది బిగినింగ్ సృష్టించబోయే రికార్డులు.. ఇప్పటివరకూ వచ్చినవాటితో పోలిస్తే చాలా తక్కువగానే ఉంటాయి. రికార్డుల లెక్క తేలింది కానీ.. అవార్డులు, రివార్డుల కథ ఇప్పుడే మొదలైంది. ఇప్పుడు ప్రతిష్టాత్మక ఏషియన్ ఫిలిం అవార్డ్స్ లో బాహుబలికి నామినేషన్ లభించడం విశేషం.

బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో ఇండియా నుంచి బాహుబలికి నామినేషన్ లభించింది. బాహుబలితో పాటు బాజీరావు మస్తానీ కూడా భారత్ నుంచి పోటీలో ఉండడం విశేషం. వీటితో పాటు చైనీస్ మూవీ 'మాన్ స్టర్ హంట్', జపనీస్ ఫిలిం 'అటాక్ ఆన్ టైటాన్', సౌత్ కొరియా సినిమా 'ది టైగర్' లు విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో అవార్డు కోసం పోటీ పడుతున్నాయి. బాహుబలికి సంబంధించిన వీఎఫ్ ఎక్స్ సూపర్వైజర్ 'శ్రీనివాస మోహన్' ఈ అవార్డు అందుకునేందుకు సిద్ధమవుతున్నాడు.

పదవ ఏషియన్ ఫిలిం అవార్డ్స్ వేడుక మార్చ్ 17న మకావులో జరగనున్నాయి. ఆసియా దేశాలకు చెందిన సినీ అతిరథ మహారథులంతా.. ఈ వేడుకలో భాగం కానున్నారు. 9 దేశాలకు చెందిన 36 సినిమాలు అవార్డుల కోసం పోటీ పడనున్నాయి. ఎక్కువ మంది అభిప్రాయం ప్రకారం.. విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో బాహుబలికే అవార్డ్ దక్కే ఛాన్సులు ఉన్నాయని టాక్.