Begin typing your search above and press return to search.
బాహుబలికి మాత్రం ఇవ్వలేదే బాబులూ!!
By: Tupaki Desk | 26 Jun 2016 9:30 AM GMTస్పెయిన్ లో ఇప్పుడు బాలీవుడ్ కి సంబంధించిన ఐఫా అవార్డుల వేడుక జరిగింది. ప్రియాంక-దీపికల్లాంటి అందాల భామలతో పాటు సల్మాన్-షారూక్ లాంటి టాప్ స్టార్స్ డ్యాన్సులతో అంగరంగవైభవంగా జరిగిన ఈ అవార్డ్ వేడుకలో.. బజరంగీ భాయ్ జాన్ కి ఉత్తమ చిత్రం అవార్డు దక్కింది. బెస్ట్ యాక్టర్ గా బాజీరావ్ మస్తానీకి గాను రణవీర్ సింగ్.. పీకులో నటనకు గాను దీపికా పదుకొనేకి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డులు దక్కాయి. అయితే.. ఈ అవార్డ్ ఫంక్షన్ లో బాహుబలికి ఒక్కటంటే ఒక్క అవార్డ్ రాకపోవడం ఆశ్చర్యకరం.
బాహుబలి ది బిగినింగ్.. ఈ మూవీ హిందీ వెర్షన్ బాలీవుడ్ లో చాలానే సంచలనాలు సృష్టించింది. అత్యధిక వసూళ్లను కొల్లగొట్టిన డబ్బింగ్ మూవీగా రికార్డులు సృష్టించింది. అతి తక్కువ టైంలో వంద కోట్ల మార్కును అందుకున్న హిందీ సినిమాల జాబితాలో స్థానం కూడా సంపాదించింది. ఇన్ని రికార్డులు సృష్టించినా.. బాలీవుడ్ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టినా.. బాహుబలి హిందీ వెర్షన్ కి ఒక్కటంటే ఒక్క అవార్డును కూడా ఇవ్వలేదు. ఐఫాతో పాటు పలు బాలీవుడ్ అవార్డు వేడుకల్లో బాహుబలిని ఓ డబ్బింగ్ సినిమా మాదిరిగా చూస్తున్నారంతే. ఈ లెక్కన చూసుకుంటే తమిళ్ అవార్డు వేడుకలే బెటర్ అనాలి. ప్రతిభకి తగినట్లుగా ప్రోత్సాహమిచ్చి.. ప్రేక్షకుల టేస్ట్ ని గౌరవించి.. తమిళ బాహుబలికి పలు అవార్డులు ప్రకటించారు.