Begin typing your search above and press return to search.
అలాంటిదేమీ లేదనేసిన బాహుబలి టీమ్
By: Tupaki Desk | 27 Jun 2015 3:30 PM GMTబాహుబలి సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని చూస్తున్నాడు రాజమౌళి. ముందు ఇండియాలో నాలుగు భాషల్లో విడుదల చేశాక.. కొంచెం గ్యాప్ తీసుకుని.. ఇంగ్లిష్‌తో పాటు కొన్ని ప్రపంచ భాషల్లో అంతర్జాతీయంగా విడుదల చేయబోతున్నట్లు చెప్పాడు. ఈ విషయంలో హడావుడేం పడట్లేదని.. ప్రస్తుతానికి రీజనల్ లాంగ్వేజెస్ మీదే దృష్టిపెట్టామని తెలిపాడు జక్కన్న. ఐతే ఇంతలోనే 'బాహుబలి'ని జపాన్‌లో తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. ఇంగ్లిష్ సబ్‌టైటిల్స్‌తో జపాన్‌లో భారీ స్థాయిలో విడుదలకు ప్లాన్ చేసినట్లు చెప్పుకున్నారు.
ఐతే ఈ వార్తల్లో నిజం లేదని చెప్పింది బాహుబలి టీమ్. ''బాహుబలి తెలుగు, తమిళ వెర్షన్స్‌ను ఇంగ్లిష్ సబ్‌టైటిల్స్‌తో జపాన్‌లో విడుదల చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు చూసి ఆశ్చర్యపోయాం. మేం కానీ.. మా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు కానీ అలాంటి ప్రయత్నాలేమీ చేయలేదు. జపాన్ థియేట్రికల్ రైట్స్‌ను మేం ఎవరికీ అమ్మలేదు. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండమని చెబుతున్నాం'' అని బాహుబలి అఫీషియల్ ట్విట్టర్ పేజీలో పోస్టు పెట్టారు. ఐతే ఈ ప్రకటనను బట్టి చూస్తుంటే జపాన్ రైట్స్ ఇంకా ఎవరికీ ఇవ్వలేదని.. రాజమౌళి చెప్పినట్లే కొన్ని రోజుల తర్వాత అంతర్జాతీయంగా అన్ని దేశాల్లో ఒకేసారి సినిమాను విడుదల చేస్తారని తెలుస్తోంది.