Begin typing your search above and press return to search.
బాహుబలికి మరో అరుదైన గౌరవం
By: Tupaki Desk | 23 Jun 2017 5:04 AM GMTరికార్డు కలెక్షన్లతో పాటు.. భారతీయ సినిమాకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది బాహుబలి 2. ఇప్పటికే ఉన్న రికార్డుల్ని షేక్ చేసేసిన ఈ చిత్రం భారతీయ చిత్ర పరిశ్రమ గర్వపడేలా అంతర్జాతీయ ఖ్యాతిని సొంతం చేసుకుంది. ఒక్కొక్కటిగా రికార్డుల్ని తన సొంతం చేసుకుంటున్న ఈ చిత్రం.. తాజాగా మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది.
ఈ మధ్యనే రికార్డు థియేటర్లలో 50 రోజుల ప్రదర్శనను పూర్తి చేసుకోవటం.. రూ.1500 కోట్ల మార్క్ కలెక్షన్లను క్రాస్ చేసి రూ.2వేల కోట్ల దిశగా అడుగులు వేయటం తెలిసిందే. త్వరలో చైనాలో విడుదల కానున్న బాహుబలి 2 మరిన్ని రికార్డులను సాధించడం ఖాయంగానే కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఈ చిత్ర రాజానికి తాజాగా అరుదైన గౌరవం లభించింది.
రష్యాలో జరిగే మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించే తొలి చిత్రంగా బాహుబలి 2 ఎంపికైంది. ఈ విషయాన్ని చిత్ర దర్శకులు రాజమౌళి ట్వీట్ చేశారు. మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం పెస్టివల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని.. ఆ అంతర్జాతీయ చలనచిత్రోత్సవ ఉత్సవంలో బాహుబలి 2ను మొదటి సినిమాగా ప్రదర్శించాలని నిర్ణయించటం గర్వంగా ఉందని.. చాలా ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/