Begin typing your search above and press return to search.
బాహుబలి పార్ట్-2కు రూ.325 కోట్లా?
By: Tupaki Desk | 16 July 2015 12:05 PM GMTపొగడ్త అయినా సరే.. తిట్టు అయినా సరే.. వర్మ లిమిట్స్ ఏమీ పెట్టుకోడు. ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌కు వెళ్లిపోతాడు. కొన్ని రోజులుగా ఆయన ట్విట్టర్ అకౌంట్ బాహుబలి పొగడ్తలతో నిండిపోతోంది. ఆ పొగడ్తలు కూడా మామూలుగా లేవు. బాహుబలి టీమ్ కూడా సిగ్గుపడిపోయేలా ఉన్నాయి. ప్రభాస్ రెమ్యూనరేషన్ రూ.65 కోట్లంటూ అందరికీ షాకిచ్చిన వర్మ.. ఇంకో ఆశ్చర్యకరమైన ట్వీట్ చేశాడు. బాహుబలి-2 సినిమాను ఓ బడా కార్పొరేట్ సంస్థ హోల్ సేల్‌గా రూ.325 కోట్లకు కొనేసిందని నిన్న రాత్రి ఓ సంచలన ట్వీట్ చేశాడు వర్మ.
బాహుబలి పార్ట్-1 అన్ని భాషలకూ కలిపి జరిగిన బిజినెస్ రూ.135 కోట్లే. శాటిలైట్ రైట్స్ కూడా కలుపుకొంటే లెక్క రూ.170-180 కోట్లకు తేలొచ్చేమో. అలాంటిది వర్మ ఏకంగా రూ.325 కోట్లని అంటుండటం షాకింగే. ఇది ఏమాత్రం నమ్మశక్యంగా లేదు. ఐతే ఏ సమాచారం లేకుండానే వర్మ ఈ ట్వీట్ చేసి ఉంటాడా అని సందేహాలు కూడా కలుగుతున్నాయి. మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా బాహుబలి సినిమా మీద పొగడ్తల వర్షం కురిపించిన నేపథ్యంలో సరదాగా ఓ గెస్ చేసి ఈ ట్వీట్ చేసి ఉండొచ్చని కూడా అనిపిస్తోంది. ఒకవేళ నిజంగానే బాహుబలి-2ను రూ.325 కోట్లకు కొంటే ఆ మొత్తం రికవర్ అవ్వడానికి కూడా అవకాశాలు లేకపోలేదు. తొలి భాగం ఇప్పటికే రూ.200 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఫుల్ రన్‌లో రూ.300 కోట్ల మార్కు చేరుకోవచ్చేమో. రెండో భాగం ఇంకా అద్భుతంగా ఉండి.. ప్రమోషన్ భారీగా చేస్తే రూ.400 కోట్ల మార్కును అందుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు