Begin typing your search above and press return to search.

బాహుబలి అక్కడ భలే ముద్ర వేసింది

By:  Tupaki Desk   |   28 Jun 2015 7:43 AM GMT
బాహుబలి అక్కడ భలే ముద్ర వేసింది
X
బాహుబలి తెలుగు వెర్షన్‌కున్న క్రేజ్‌ ఏంటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇక తమిళ వెర్షన్‌ విషయానికొస్తే.. అక్కడ జ్ఞానవేల్‌ రాజా లాంటి ప్రముఖ నిర్మాత సినిమాను విడుదల చేస్తున్నాడు. రాజమౌళి అక్కడి జనాలకు బాగానే పరిచయం. సినిమాలో ప్రముఖ తమిళ నటులు కూడా ఉన్నారు కాబట్టి రావాల్సినంత హైప్‌ వచ్చేసింది. ఇక హిందీ వెర్షన్‌ సంగతి చూస్తే.. కరణ్‌ జోహార్‌ లాంటి అగ్ర నిర్మాత ముందు నిలుచుని సినిమాను ఓ రేంజిలో ప్రమోట్‌ చేస్తున్నాడు. ఇక మిగిలిందల్లా మలయాళ వెర్షనే. ఇప్పటిదాకా ఎలాంటి ప్రచారం, హంగామా లేనిది మలయాళ వెర్షన్‌ విషయంలోనే.

అందుకే బాహుబలి మలయాళ ఆడియో ఫంక్షన్‌ను నభూతో అన్న తరహాలో చేసింది రాజమౌళి టీమ్‌. లెజెండరీ డైరెక్టర్‌ ప్రియదర్శన్‌ను ఆడియో ఫంక్షన్‌కు ఆహ్వానించి.. బాహుబలి టీమ్‌ అంతా ఈ ఫంక్షన్‌కు హాజరైంది. అంతే కాదు.. ప్రపంచంలోనే అతి పెద్ద ఫిలిం పోస్టర్‌ను ఈ సందర్భంగా ఆవిష్కరించి ప్రపంచ రికార్డు నెలకొల్పింది బాహుబలి టీమ్‌. ఆడియో ఫంక్షన్‌ ప్రాంగణంలో ఈ భారీ పోస్టర్‌ను నేలమీద పరిచారు. ఆ పోస్టర్‌ ఎంత పెద్దదంటే.. దాని ముందు ఆడియో వేడుక ఆడిటోరియం చిన్నబోయింది. ఈ పోస్టర్‌ను గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌కు పంపిస్తున్నారు. మొత్తానికి ఈ పోస్టర్‌ హంగామాతో కేరళలో బాహుబలి సినిమా గురించి బాగానే చర్చ జరుగుతోంది. జక్కన్న అండ్‌ కో కోరుకున్న పబ్లిసిటీ వచ్చేసింది. టార్గెట్‌ రీచ్‌ అయినట్లే.