Begin typing your search above and press return to search.

పైరసీపై అద్భుతమైన మాట ఇదే

By:  Tupaki Desk   |   3 July 2015 5:30 PM GMT
పైరసీపై అద్భుతమైన మాట ఇదే
X
ఇక జూలై 10న బాహుబలి సినిమా విడుదలవుతోంది అనే ఆనందకంటే.. ఆ సినిమాను పైరసీ చేసేసి ఎక్కడ జనాల్లోకి ఒక దొంగ ప్రింటును దించేసి.. నిర్మాతలకు డబ్బు పరంగా నష్టపరచడమే కాదు.. ఏకంగా వారి కృషిని దోచుకుంటారేమోనని అభిమానులు ఫీల్‌ అవుతున్నారు.

''కథకు ప్రాణం పోసిన కుటుంబం.. 1128 రోజుల కష్టం.. 132 కోట్ల 42 లక్షల ఖర్చు.. సుమారు 900 మంది శ్రమ.. ఒక సినిమా కోసం తన పెళ్ళినే పోస్ట్‌పోన్‌ చేసుకున్న హీరో.. అదే ''బాహుబలి''.. ప్రేక్షకుల ముందుకు రావడానికి శ్రమించిన రాజమౌళి కష్టాన్ని వెలకట్టలేం.. దయచేసి 900 మంది కష్టాన్ని వృథా చేసి పైరసీని ప్రోత్సహించవద్దు'' అంటూ సామాజిక సైట్లలో ఇప్పుడు బాహుబలి ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున ఉద్యమాన్నే చేస్తున్నారు. ఇంత అద్భుతంగా పైరసీని చేయొద్దని ఒక ఫ్యాన్స్‌ గ్రూప్‌ రిక్వెస్ట్‌ చేయడం బహుశా ఇండియాలో ఇదే మొదటిసారేమో.

ఇకపోతే గతంలోనే బాహుబలి నిర్మాత శోభు ఒక విషయాన్ని తెలియజేశారు. ఒకవేళ టొరెంట్‌ వెబ్‌సైట్లలో బాహుబలి సినిమా పైరసీ డౌన్‌లోడ్‌ లింక్‌ను ఉంచితే కనుక సదరు టొరెంట్‌ వెబ్‌సైట్‌, ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌పై యాక్షన్‌ తీసుకోవాలని కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. ఆ డైరక్షన్‌లో ఒకవేళ కోర్టు ఆర్డర్‌ ఏదైనా వస్తే మాత్రం ఈ ఫ్యాన్స్‌ శ్రమ ఫలించినట్లే. పైరసీకి చోటే ఉండదు.

ఇక మనమాటగా చెప్పొచేద్ది ఏంటంటే.. ఈ రేంజులో తీసిన ఓ గొప్ప సినిమాను 100 రూపాయల టిక్కెట్టు కొని ధియేటర్స్‌లో చూస్తే వచ్చే ఆ కిక్కే వేరు. అంతేకాని కక్కూర్తిగా డివిడి ప్రింటులో టివిలో చూస్తే అది ఖచ్చితంగా ఓ దశ్చర్యే. వారి కష్టాన్ని గౌరవిద్దాం. ఏమంటారు?