Begin typing your search above and press return to search.
మెగా ఫ్యామిలీకి అది సవాలే!
By: Tupaki Desk | 15 July 2015 4:23 AM GMTచిత్రసీమలో కొత్త రికార్డులు నమోదవడం, వాటిని ఎవరో ఒకరు మళ్లీ తిరగ రాయడం మామూలే. ఇదివరకు ఒక హీరో సినిమా వంద రోజులు ఆడిందంటే మరో హీరో సినిమా 150 రోజులు ఆడేది. అలా అలా 400 రోజుల వరకు రికార్డులు నమోదయ్యాయి. ఇప్పుడు మాత్రం రోజులకన్నా ఎన్ని వసూళ్లు సాధించాయనేదే చూస్తున్నారు. అలా `బాహుబలి` తెలుగులో 200కోట్ల రూపాయలు వసూలు చేసిన తొలి చిత్రంగా రికార్డు సృష్టించబోతోంది.
టాలీవుడ్‌లో ఏ హీరో సినిమా ఇలా ఎన్ని రికార్డులు సాధించినా... వాటిని మెగా హీరోలు మళ్లీ తిరగరాసేవారు. మొదట్లో చిరంజీవి సినిమాలు అంతకుముందున్న రికార్డులన్నీ తిరగరాశాయి. ఆ తర్వాత పవన్‌కళ్యాణ్, రామ్‌చరణ్ వచ్చి రికార్డుల పని పట్టారు. `బాహుబలి` ముందు వరకు టాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించినవి `మగధీర`, `అత్తారింటికి దారేది` చిత్రాలే. వాటితో పోలిస్తే `బాహుబలి` రెట్టింపు వసూళ్లను సొంతం చేసుకొని కనీ వినీ ఎరుగనంత పెద్ద రికార్డును నమోదు చేసింది. మరి ఇప్పుడు ఆ రికార్డును బీట్ చేయడం ఎవరివల్ల సాధ్యం? ఎప్పుడూ రికార్డుల పనిపట్టే మెగా హీరోలకి `బాహుబలి` రూపంలో పెద్ద సవాలే ఎదురైనట్టయింది.
ప్రేక్షకుల్లో క్రేజ్ ఉన్న పవన్‌కళ్యాణే బాహుబలి రికార్డుల్ని కొట్టగలడని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే అందుకు తగ్గట్టుగా క్రేజీ కాంబినేషన్ కూడా తోడవ్వాలి. ప్రభాస్‌కి రాజమౌళి తోడైనట్టుగా, పవన్‌కళ్యాణ్‌కి మళ్లీ త్రివిక్రమ్‌లాంటి దర్శకుడు తోడైనప్పుడే ఆ సినిమా గురించి ప్రేక్షకులు క్రేజీగా మాట్లాడుకొనే అవకాశం ఉంటుంది. ఆ ఊపులో వచ్చే సినిమాలే ఇలాంటి రికార్డుల్ని సాధించగలవని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.