Begin typing your search above and press return to search.

టాలీవుడ్‌లో ఈగమ్యాన్‌, మేలిఫిషియెంట్‌

By:  Tupaki Desk   |   26 Jun 2015 1:00 AM IST
టాలీవుడ్‌లో ఈగమ్యాన్‌, మేలిఫిషియెంట్‌
X
థీమ్‌ పార్టీ .. ఇదేమీ వినడానికి కొత్తేమీ కాదు. నిత్యజీవితంలో ఒత్తిళ్ల నుంచి బైటపడడానికి పాశ్చాత్యులు కనిపెట్టిన మందు ఇది. టాలీవుడ్‌ సెలబ్రిటీలు ఇటీవలి కాలంలో ఈ తరహా పార్టీలకు అలవాటు పడ్డారు. లేటెస్టుగా బాహుబలి టీమ్‌ కూడా ఈ పార్టీతో రిలాక్సయ్యింది. అంతేకాదు ఈ పార్టీకి ఓ ప్రత్యేకత ఉంది. స్టార్లు వింతైన గెటప్పులతో స్టార్లు దర్శనమిచ్చి జనాలకు షాకిచ్చారు. హీరో నాని, కథానాయిక అనుష్క కొత్త అవతారాల్లో కనిపించి వారెవ్వా అనిపించారు.

సూపర్‌మేన్‌ గెటప్‌ని మార్చేసి ఈగమ్యాన్‌గా మార్చేశారు. ఈగమ్యాన్‌ గెటప్పులో నాని సరికొత్తగా కనిపించాడు. అలాగే మేలిఫిషియెంట్‌ (యాంజెలినా జోలీ కథానాయికగా ఇటీవల రిలీజైన ఓ హాలీవుడ్‌ సినిమా) గెటప్‌లోకి మారిపోయిన అనుష్కను అస్సలు ఎవరూ గుర్తించేలేకపోయారంటే నమ్మండి. బ్లాక్‌ కలర్‌ డ్రెస్‌.. నెత్తి మీద రెండు కొమ్ములు .. చూడగానే యాంజెలినా మేలిఫిషియెంట్‌ గుర్తొస్తుంది. అలాగే బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ బ్యాట్‌మేన్‌ గెటప్పులో అలరించాడు. డిజైనర్‌ ప్రశాంతి త్రిపురనేని రూపొందించిన దుస్తులు ఇవి. అప్పుడప్పుడు రిలాక్సేషన్‌ కోసం ఇలాంటి పార్టీలు. ఐడియా బావుంది కదూ!