Begin typing your search above and press return to search.

బాహుబలి తప్పుల్ని సరి చేశారు

By:  Tupaki Desk   |   2 Feb 2017 10:50 AM GMT
బాహుబలి తప్పుల్ని సరి చేశారు
X
ఈ మధ్య రాజమౌళి రిలీజ్ చేసిన ‘బాహుబలి: ది కంక్లూజన్’ పోస్టర్ అభిమానులకు భలే ఆనందాన్నిచ్చింది. ప్రభాస్.. అనుష్క కలిసి ఇచ్చిన పోజు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. దీనికి ముందు ప్రభాస్.. రానాల పోస్టర్ల విషయంలో నేరుగా నెగెటివ్ కామెంట్లు పడ్డాయి. వాటితో పోలిస్తే ఈ కొత్త పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రాజమౌళి అన్నట్లు ఈ పోస్టర్ ఆర్టిస్టిగ్గా అనిపించి.. ‘బాహుబలి: ది కంక్లూజన్’ మీద ఆసక్తిని మరింత పెంచింది.

ఐతే ఒక రోజు గడిచాక సీన్ మారిపోయింది. ఈ పోస్టర్లో తప్పులు వెతకడం మొదలుపెట్టారు నెటిజన్లు. ఈ పోస్టర్లో అనుష్క ప్రభాస్ కంటే ముందు నిలుచుని ఉంటే.. ఆమె విల్లు మాత్రం వెనక్కి ఉన్నట్లుగా చూపడంతో నెటిజన్లు రెచ్చిపోయారు. ఇంకా అనుష్క చేతిలో ఉన్న బాణాలు కొంచెం అటు ఇటుగా ఉండటం మీదా విమర్శలు అందుకున్నారు. రెండు మూడు రోజుల పాటు సోషల్ మీడియాలో దీనిపై ట్రోలింగ్ పెద్ద ఎత్తున నడిచింది.

ఐతే ఈ విమర్శల్ని లైట్ తీసుకుని వదిలేయకుండా ‘బాహుబలి’ బృందం వెంటనే స్పందించింది. ఈ పోస్టర్లను సరి చేసింది. టెక్నికల్ టీంతో ఆ విల్లు తప్పిదాన్ని సరి చేసింది. విల్లు ఎలా ఉండాలో అలా సెట్ చేసి కొత్త పోస్టర్లు వదిలారు. చాలామంది తప్పులెంచితే ఇగో ఫీలవుతారు. తప్పుల్ని దిద్దుకోవడానికి ఇష్టపడరు. ఐతే ‘బాహుబలి’ బృందం మాత్రం అలా చేయకుండా.. ఆ తప్పిదాన్ని సరిదిద్ది కొత్త పోస్టర్లు వదిలి మంచి పని చేసింది. లేదంటే సోషల్ మీడియాలో జనాలు మళ్లీ మళ్లీ ఈ విషయాన్ని లేవనెత్తి ట్రోలింగ్ చేస్తుంటారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/