Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: సెల్ఫీలకే బాహుబలి వచ్చింది

By:  Tupaki Desk   |   27 March 2017 4:32 AM GMT
ఫోటో స్టోరి: సెల్ఫీలకే బాహుబలి వచ్చింది
X
గత రాత్రి రామోజీ ఫిలిం సిటీ ప్రాంగణంలో బాహుబలిః ది కంక్లూజన్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మొత్తం ఈవెంట్ పూర్తయ్యాక స్టేజీపై అందరం ఒక సెల్ఫీ దిగుదాం అని దర్శకుడు రాజమౌళి సూచించాడు. మనోడు ఆ మాట అనగానే సినిమాటోగ్రాఫర్ సెంథిల్ తన ఫోనుతో రెడీ అయిపోయాడు. అలా ఊడిపడిందే ఈ బాహుబలి సెల్ఫీ.

నిన్నటి స్టేజీపై సెంథిల్ తీసిన ఆ ఫోటోలో.. బాహుబలియన్ సెల్ఫీలో.. ఈ సినిమా కీలక టీమంతా ఎలా మెరుస్తున్నారో చూడండి. పైవరుసలో చూసుకుంటే.. నాజర్.. విఎఫ్‌ఎక్స్ సూపర్ వైజర్ కమల్ కణ్ణన్.. నిర్మాత ప్రసాద్.. బాలీవుడ్ నిర్మాతలు కరణ్‌ జోహార్.. అనిల్ తడాని ఉన్నారు. ఇక రెండో వరుసలో.. కట్టప్ప సత్యరాజ్.. సుబ్బరాజు.. కీరవాణి.. అనుష్క.. ప్రభాస్.. రానా.. తమన్నా.. రమ్యకృష్ణ.. డిజైనర్ ప్రశాంతి త్రిపిరినేని.. 3వ వరుసలో సెంథిలో.. శోభు యార్లగడ్డ.. రాజమౌళి చాలా హ్యాపీగా ఫోజిచ్చారు.

ఏప్రియల్ 28న విడుదలవుతున్న బాహుబలి 2 రిజల్టుపై వీరు ఏ రేంజు కాన్ఫిడెన్స్ తో ఉన్నారు ఈ సెల్ఫీ చూస్తూ అర్ధమవుతోంది కదూ!!


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/