Begin typing your search above and press return to search.
బాహుబలి కోసం మెడికల్ క్యాంప్!!
By: Tupaki Desk | 13 Jan 2017 4:59 AM GMTబాహుబలి సీక్వెల్ కోసం సినిమా ఇండస్ట్రీ అంతా ఎదురుచూస్తోంది. ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తామని నిర్మాతలు పదే పదే చెబుతున్నా.. ఇన్నాళ్లూ అనుమానంగానే చూశారు చాలామంది. అయితే.. ఓ వారం క్రితం బాహుబలి ది కంక్లూజన్ షూటింగ్ కొబ్బరికాయ కొట్టేశామని చెప్పడంతో.. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అసలు ఇంతలా లేట్ అవడానికి కారణం.. ఈ సీక్వెల్ ప్రభాస్ తో చేయించిన యాక్షన్ సీక్వెన్స్ లే కారణం అని తెలుస్తోంది.
బాహుబలిలోనే యుద్ద సన్నివేశాలతో సహా అనేక డేంజర్ సీన్స్ ఉంటాయి. వీటికి వచ్చిన రెస్పాన్స్ తో.. బాహుబలి సీక్వెల్ లో ఈ హైఓల్టేజ్ యాక్షన్ సీన్స్ ను మరింత పకడ్బందీగా తెరకెక్కించాడట జక్కన్న. అయితే.. ఇవన్నీ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం కావడంతో.. పెద్ద మెడికల్ టీంని కూడా షూటింగ్ జరిగినన్నాళ్లు రెడీగా ఉంచారని తెలుస్తోంది. ఓ ఫిజియో థెరపిస్ట్ తో పాటు.. కొంతమంది డాక్టర్ల టీం.. షూటింగ్ జరిగిన అన్ని రోజులు బాహుబలి యూనిట్ తోనే కలిసి గడిపారట.
యాక్షన్ ఎపిసోడ్స్ కారణంగా ఎక్కువగా ప్రభాస్ గాయాలు అయ్యే అవకాశాలు ఉండడం.. మరోవైపు యుద్ధ సన్నివేశాల్లో ఏ ఒక్కరికి చిన్నగాయం అయినా వెంటనే ట్రీట్మెంట్ చేయించడం కోసం ఇలా పెద్ద మెడికల్ క్యాంప్ నే రన్ చేసిందట బాహుబలి టీం. మొత్తానికి ఆ షూటింగ్ కష్టాలన్నీ గట్టెక్కి.. ఇప్పుడు బాహుబలి2 పోస్ట్ ప్రొడక్షన్ దశలోకి వచ్చేసింది. రిలీజ్ డేట్ విషయంలో వస్తున్న అనుమానాలను.. నిర్మాతలు ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూనే ఉన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/