Begin typing your search above and press return to search.
అక్కడ బాహుబలి ప్రభంజనం..ఇక్కడ మోడీ పక్షపాతం
By: Tupaki Desk | 20 Oct 2019 9:05 AM GMTఇండియన్ సినిమా అంటే ఏంటో ప్రపంచానికి చూపించిన చిత్రం ‘బాహుబలి’. మన జక్కన్న విజువల్ వండర్ పుణ్యమా అనే ప్రపంచ స్థాయిలో ఇండియన్ సినిమాకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు దక్కింది. ఇండియన్ సినిమాకు ఇప్పటిదాకా దక్కని గౌరవాలెన్నో ఆ చిత్రం దక్కించుకుంది. లండన్ లోని ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ హాల్ కు 148 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉండగా.. ఇన్నేళ్ల చరిత్రలో అక్కడ ప్రదర్శితమైన తొలి నాన్ ఇంగ్లిష్ మూవీగా కూడా మన ‘బాహుబలి’ అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ఇక్కడ జరుగుతున్న చిత్రోత్సవాల్లో భాగంగా.. పేరుమోసిన హాలీవుడ్ సినిమాలతో పాటుగా ప్రదర్శితమై భారతీయ సినిమా గౌరవాన్ని పెంచింది ‘బాహుబలి’. హాలీవుడ్ సినిమాలకు కూడాా లేని స్థాయిలో నిన్న సాయంత్రం రాయల్ ఆల్బర్ట్ హాల్ లో నెలకొన్న సందడి.. ఆ యుఫోరియా చూసి నిర్వాహకులు సైతం ఆశ్చర్యపోయారు. ఇదీ సౌత్ సినిమా.. ఇంకా తెలుగు సినిమా సత్తా.
ఐతే వేరే దేశంలో మన తెలుగు సినిమాకు ఇంతటి గౌరవం దక్కుతున్న సమయంలోనే.. స్వయంగా మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలుగు సినిమాల్ని - దక్షిణాది చిత్రాల్ని కించపరిచే పని చేశారు. మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకల్లో భాగంగా స్వచ్ఛ భారత్ ఇతర కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన పెంచే ఉద్దేశంతో ఆయన సినీ పరిశ్రమతో కలిసి పని చేసేందుకు సినీ ప్రముఖుల్ని ఆహ్వానించారు. పేరుకేమో ఇది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీతో సమావేశం. కానీ అక్కడ ఉన్నవాళ్లందరూ బాలీవుడ్ ప్రముఖులే. ఆమిర్ ఖాన్ - షారుఖ్ ఖాన్ సహా అందరూ హిందీ ఫిలిం సెలబ్రెటీలే ఉన్నారక్కడ. ఒక్కరంటే ఒక్క దక్షిణాది సెలబ్రెటీకి కూడా ఆ సమావేశంలో పాల్గొనే అవకాశం దక్కలేదు. ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అని విదేశీయులు ఒకప్పుడు అనుకునేవాళ్లు. కానీ ‘బాహుబలి’ లాంటి సినిమాలతో వాళ్లకు జ్ఞానోదయం అయింది. కానీ మన ప్రధానికి - ప్రభుత్వాలకే ఈ విషయం ఇంకా విషయం బోధపడకపోవడం విచారకరం.