Begin typing your search above and press return to search.
‘బాహుబలి-2’ కౌంట్ డౌన్ మొదలైపోయింది
By: Tupaki Desk | 19 Jan 2017 8:15 AM GMT2017 మొదలైపోయింది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకునే సంవత్సరంలోకి అడుగుపెట్టేశాం. ‘బాహుబలి: ది కంక్లూజన్’ విడుదలకు ఇంకెన్నో రోజులు లేదు. 100 రోజుల కౌంట్ డౌన్ కూడా మొదలైపోయింది. ఆల్రెడీ బాహుబలి టీం సోషల్ మీడియాలో హడావుడి మొదలుపెట్టేసింది. ‘100 డేస్ టు బాహుబలి-2’.. ‘బాహుబలి కౌంట్ డౌన్ స్టార్ట్స్’ అనే హ్యాష్ ట్యాగ్ లతో ట్విట్టర్లో సందడి చేస్తున్నారు అభిమానులు. రానా దగ్గుబాటితో సహా చాలామంది సెలబ్రెటీలు కూడా ఇందులో భాగమయ్యారు. బాహుబలి-2 కోసం ఎంత ఉత్కంఠగా ఎదురు చూస్తున్నది చెబుతూ అభిమానులు తమ ఎగ్జైట్మెంట్ ను పంచుకున్నారు.
‘బాహుబలి: ది బిగినింగ్’ విడుదలకు రెండు నెలల ముందు నుంచే ప్రమోషన్ హోరు మొదలైంది. రోజూ సినిమాను వార్తల్లో నిలబెడుతూ సినిమా మీద హైప్ పెంచుతూ పోయింది ‘బాహుబలి’ టీమ్. ఇప్పుడు ‘బాహుబలి: ది కంక్లూజన్’ విషయంలో వంద రోజుల నుంచే కౌంట్ డౌన్ మొదలైపోయింది. తొలి పార్ట్ మాదిరి రెండో భాగాన్ని వాయిదాలు వేసే అవకాశం లేదు. అనుకున్నట్లుగా ఏప్రిల్ 28నే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేయనుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అనుకున్న ప్రకారం సాగిపోతోంది. దీంతో ప్రమోషన్ కూడా పక్కా ప్రణాళిక ప్రకారం చేయనున్నారు. శుక్రవారం బాహుబలి మీద రాసిన పుస్తకావిష్కరణ జరగబోతోంది. ఆ తర్వాత కూడా అనేక ఈవెంట్లు ప్లాన్ చేసింది ‘బాహుబలి’ బృందం. క్రమ క్రమంగా ప్రమోషన్ జోరు పెంచి రిలీజ్ నాటికి హైప్ పతాక స్థాయికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/