Begin typing your search above and press return to search.
బాహుబలి-2 హిందీ శాటిలైట్ రేటుతో కళ్లుజిగేల్
By: Tupaki Desk | 25 Aug 2016 5:32 AM GMTదర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో ప్రతి రోజు ఎక్కడో ఓ చోట చూస్తూనే ఉన్నాం. ఈ సినిమా రూ.600 కోట్ల వసూళ్లు కొల్లగొట్టడంతో పాటు ఇప్పటికీ ఏదో ఒక దేశంలో రిలీజ్ అవుతూనే ఉంది. ఇక బాహుబలి హిందీ వెర్షన్ పెద్ద అంచనాలేమి లేకుండానే రిలీజ్ అయ్యి ఏకంగా రూ.120 కోట్ల వసూళ్లు రాబట్టింది.
ఆ సినిమాను హిందీలో ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ రిలీజ్ చేయగా బాహుబలి 2 హిందీ - ఇంటర్నేషనల్ వెర్షన్ హక్కులను సైతం ఆయనే దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇక బాహుబలి -2 ప్రపంచవ్యాప్తంగా వచ్చే యేడాది ఏప్రిల్ 28న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.
తెలుగు ప్రేక్షకులు బాహుబలి 2 కోసం కళ్లు కాయలు కాచేలా ఎలా ఎదురు చూస్తున్నారో...నార్త్ ఇండియన్ ప్రేక్షకులు కూడా అదే స్థాయిలో ఉత్కంఠతో వెయిట్ చేస్తున్నారు. ఇక బాహుబలి-2 రూ.1000 కోట్లు సాధిస్తుందని కూడా ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. సినిమాపై ఉన్న అంచనాలతో బాహుబలి -2 హిందీ వెర్షన్ శాటిలైట్ రైట్స్ కు దిమ్మతిరిగే రేటు లభించింది.
జీఈసీ ఛానెల్ ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కోసం రూ.50 కోట్లు ఆఫర్ చేసిందట. అయితే సినిమా నిర్మాతలు మరో రూ.10 కోట్లు అదనంగా అడగగా - చివరకు రూ.55 కోట్ల దగ్గర రేటు తెగినట్టు తెలుస్తోంది. బాలీవుడ్ లో సల్మాన్ - షారుఖ్ - హృతిక్ సినిమాలకే ఈ స్థాయిలో శాటిలైట్ రేటు వస్తుంది. కానీ మన బాహుబలి 2కు కూడా ఇప్పుడు ఆ సినిమాలకు ధీటుగా శాటిలైట్ రేటు పలకడం గ్రేట్ అనాల్సిందే.