Begin typing your search above and press return to search.
బాహుబలి మూడు బాణాల కథ
By: Tupaki Desk | 3 Aug 2017 5:56 PM GMTరాజమౌళి జానపద కళాత్మక చిత్రం బాహుబలి గురించి ఒక ఆసక్తికర విషయం ఈ మధ్య వెలుగులోకి వచ్చింది. బాహుబలి అంటేనే అందరికి గుర్తుకు వచ్చేది అమరేంద్ర బాహుబలి యుద్దం గురించి అతని వీరోచిత పోరాటులు గురించే కదా. ముఖ్యంగా బాహుబలి(ప్రభాస్) దేశ పర్యటన కోసం వెళ్ళి కుంతల రాజ్యం యువరాణి దేవసేన (అనుష్క శెట్టి) తో ప్రేమ పడి ఆమె కోటలో పాగా వేస్తాడు. ఒక సమయంలో కుంతల రాజ్యం పై శత్రువులు దాడిచేసినపుడు మూడు బాణాలను ఒకేసారి ఎలా వదలాలో దేవసేనకు నేర్పిస్తాడు బాహుబలి. అయితే రాజమౌళికి ఈ థాట్ ఎలా వచ్చిందంటారూ?
మన చరిత్ర నుండి మన పురాణాలు నుండి ప్రేరణ పొందే రాజమౌళి ఇలా చేశాడని అనిపిస్తోంది. మూడు బాణాల సీన్ తెర పై చూసినప్పుడు.. ఆశ్చర్యం తో షాకయ్యారందరూ. అసలు ఈ ఆలోచన రాజమౌళికి ఎలా వచ్చింది అంటే.. అరమ్ ఆర్కియాజికల్ రిసర్చ్ సెంటర్లో కొన్ని రాళ్ళ పై చెక్కిన శిల్పాలలో కొంత మంది సైనికులు బాహుబలి లాంటి మూడు బాణాలతో విల్లును పట్టుకొని యుద్దం చేసే బొమ్మలు ఉన్నాయట. ఈ రిసెర్చ్ సెంటర్ తమిళనాడు లోని తాల్లి లో ఉంది. ఇలాంటి యుద్ద విన్యాసాలు 13 శతాబ్ధం నాటివి అని తెలుస్తుంది. అప్పటి విజయనగర రాజులు కాలంలో ఇటువంటి బాణాలు ఉండేవిగా చరిత్ర చెబుతుంది. ఈ యుద్ద ప్రకీయ బాహుబలి సినిమాలో ఉండే మూడు బాణాల వేసే పద్దతికి దగ్గరలో ఉన్నాయి.
నా సినిమాలు అన్నీ మహాభారతం, రామాయణం నుండి పుట్టినివే అని చాలాసార్లు చెప్పాడు రాజమౌళి. పాత్రలతో పాటు ఇలా మూడు బాణాలు విల్లు కి కూడా ఆ పురాణాలే ఆధారం కావచ్చు.