Begin typing your search above and press return to search.
నాన్నా బాహుబలి.. దాహం చల్లారలేదా??
By: Tupaki Desk | 11 May 2017 12:51 PM GMTఇప్పుడు బాహుబలి 2 సినిమా ఆల్రెడీ 1000 కోట్ల కలక్షన్ దాటింది కాబట్టి.. ఇకనైనా కాస్త స్లో అవుతుందేమోనని ట్రేడ్ పండితులు అనుకుంటుండగా.. 13వ రోజు కూడా సినిమాకు మాంచి కలక్షన్లే వచ్చాయి. అయితే ఈ కలక్షన్లన్నీ కేవలం సినిమాలో ఉన్న దమ్ము వలనే కాకుండా.. టిక్కెట్ రేటు 200 ఉండడం వలన కూడా బాగా పెరిగిపోయాయ్. అసలు గవర్నమెంట్లు టిక్కెట్ రేటు పెంచుకోమని పర్మిషన్ ఇస్తే.. మరీ ఇన్నేసి రోజులు టిక్కెట్లు పెంచేస్తే ఎలా నానా బాహూ?
నిజానికి ఇంకా బాహుబలి సినిమాను చాలామంది బిలో మిడిల్ క్లాస్ వర్గాల వారు చూడనేలేదు. ఒక అపార్టుమెంటులోని ఫ్లాట్ల వారందరూ సినిమాను చూసుంటారేమో కాని.. అక్కడ పనిచేసే మెయిడ్స్.. కాపలా ఉండే వాచ్ మ్యాన్ లు మాత్రం ఇంకా చూసుండరు. ఎప్పుడు సినిమా టిక్కెట్ ధర తగ్గుతుందో అప్పుడే చూద్దాం అని చాలామంది వెయిట్ చేస్తున్నారట. అందుకే టిక్కెట్ రేటు 100 రూపాయలకు వస్తుందేమో అని వీరు వెయిటింగ్. కాని రెండు వారాలైనా కూడా ఇంకా బాహుబలి 2 సినిమా టిక్కెట్లు మాత్రం రేటును తగ్గించనేలేదు. ఆల్రెడీ డిస్ర్టిబ్యూటర్లు పెట్టిన డబ్బులు రికవరీ అయిపోయి.. అందరికీ లాభాలు కూడా వచ్చేయగా.. ఇంకా రేటు తగ్గంచలేదేంటే.. లాభాల దాహం ఇంకా చల్లార్లేదనేగా.
అయితే రాజమండ్రి వంటి కొన్ని ఊళ్ళలో మాత్రం.. ఈ వారం తరువాత టిక్కెట్లు రేటును పూర్తిగా తగ్గిస్తారని ధియేటర్ వారు చెబుతున్నారు. ఏదేమైనా కూడా బాహుబలి ఇటు మీడియా సినిమాతో ఫ్రీగా ఖర్చులేని పబ్లిసిటీ.. అటు గవర్నమెంట్ సహాయంతో టిక్కెట్ రేట్ల హైక్.. భలే పొందేసిందిలే.